Monday, March 9, 2009

ప్రస్తుతం చంద్రబాబుకు వోటేయ్యడం న్యాయమా? - చంద్రబాబు అభిమాని

నా బ్లాగుకు ప్రేరణ - http://hridayam.wordpress.com/2009/03/06/babu-trucolors/ ముందు ఇది చదివి తరువాత క్రింద చదవండి

ప్రజాస్వామ్యంలో ప్రజలను ఎంతగా తప్పుదోవ పట్టించవచ్చొ దీన్ని చూస్తే తెలిసిపోతోంది.

"ఇందులో నాయుడుగారి తప్పేమీ లేదు. ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారు. ప్రజల నాడిని బట్టి వెళ్ళేవాడే ప్రజాస్వామ్యంలో ఉత్తమ నాయకత్వ లక్షణాలు గలవాడుగా గుర్తింపు పొందుతాడు. మన ప్రజలు ఉచితాలివ్వకపోతే వోటెయ్యరు. వాళ్ళకి అలా అలవాటు చేశారు కాంగ్రెస్సువాళ్ళు. అది వాళ్ళ తప్పు, ఆ స్థాయి నుంచి ఎదక్కపోవడం, నాయుడుగారి దీర్ఘకాలిక లక్ష్యాలకి మద్దతివ్వకపోవడం. మనం చెప్పేది ప్రజలకి అర్థం కానప్పుడు వాళ్ళకర్థమయ్యే స్థాయికి మనం దిగాలి, కొన్నిసార్లు దిగజారాలి. ఇది నైతికసూత్రం కాకపోవచ్చు, కానీ రాజకీయ మనుగడ సూత్రం. "

విఙ్ఞులే ఇలా ఆలోచిస్తే ఇక పామరులేపాటి? ప్రజల నాడిని బట్టి వెళ్ళేవాడు ప్రజాస్వామ్యంలో తాత్కాలికంగా గుర్తింపు పొందుతాడు. కాని స్థిరమైన దీర్ఘకాలిక అభిప్రాయాలతో ప్రజలకు మంచి చేసేవాడే అసలైన నాయకుడు. మనుగడ కోసం వెంపర్లాడేది సామాన్యుడు. మెరుగైన జీవనాన్ని చూపేవాడు నాయకుడు. దీనికోసం నాయకుడు పోరాడాలి. కొన్నిసార్లు అది ప్రజలతోనే కావచ్చు. దీనివల్లే ప్రజలు గతంలో చంద్రబాబును ఆదరించారు. తదనంతర పర్తిస్తితుల్లో వోడించినా, ప్రస్తుత పాలనను చూసి బెంబేలెత్తి వున్నారు. తాత్కాలిక ప్రయోజనాలకోసం అసలు ప్రయోజనాలకు ఎలా చేటు కలిగిందో గ్రహిస్తున్నారు. చంద్రబాబును వోడించినందుకు పశ్చాత్తాప పడుతున్న ఎందరో అతని అసహనపు పొత్తులను/వాగ్దానాలను చూసి నివ్వెర పోతున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్న నాయకుడు స్వల్ప పరాజయాలకే ఇంతగా బెంబేలెత్తిపోవడం అధికార ఆరాటాన్నీ, స్వయం నిర్దేసిత లక్ష్యాలపై అతనికున్న నిబద్దతనూ సూచిస్తోంది.

చంద్రబాబు బలం యువత, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో యువత అతనికి దూరమైపోతోంది. ఇంతకాలం బాబు ఒక చాణక్యుడని తలపోసాను, కానీ అతనుకూడా ఆ తానులో ముక్కైపోయాడు. చాణక్యుడంటే కపటాలను రాజకీయంగానే వినియోగించాడు కానీ ప్రజా క్షేమాన్ని విస్మరించలేదు. ఇప్పుడు నేనెందుకు అతనికి వోటెయ్యాలి? చంద్రబాబు కేస్తే మనం అతని విధానాలను సమర్థించినట్లవుతుంది. అప్పుడు వైయెస్(మరింత మంది) వచ్చే ఎన్నికల్లో మరో కొత్త పథకంతో వస్తాడు. వేసేదేదో వైయెస్ కేస్తే, చంద్రబాబుకి గుణపాఠమవుతుంది, చిరంజీవిలాంటి మరో కొత్త వాటాదారూ అణిగిపోతాడు. అప్పుడు మనం ఒకే పాలకునితో పోరాడవచ్చు. చంద్రబాబుకో, చిరంజీవికో వేస్తే మళ్ళీ మరింతమంది మిగులుతారు. వారందరితో పోరాటం మన శక్తికి మించినది.

ప్రస్తుత పరిస్తితుల్లో వైయెస్ గెలిచినా పెద్ద నష్టం లేదు. చంద్రబాబు/చిరంజీవి గెలిస్తే ప్రజలు మరోసారి పొరపాటు చేసినట్లే. రాజకీయ నేతలకు మనం తప్పుడు సంకేతాలందించినట్లే. వీళ్ళందరినీ వోడిస్తే ప్రజలు విఙ్ఞులైనట్లే, కానీ అది సుదూర స్వప్నం.

ఇక ప్రత్యామ్న్యాయమంటారా? ఆలోచించండి మీకే తెలుస్తుంది/కనిపిస్తుంది.

13 comments:

Anonymous said...

వేసేదేదో వైయెస్ కేస్తే, చంద్రబాబుకి గుణపాఠమవుతుంది, చిరంజీవిలాంటి మరో కొత్త వాటాదారూ అణిగిపోతాడు. అప్పుడు మనం ఒకే పాలకునితో పోరాడవచ్చు. చంద్రబాబుకో, చిరంజీవికో వేస్తే మళ్ళీ మరింతమంది మిగులుతారు. వారందరితో పోరాటం మన శక్తికి మించినది".

Your analysis has few flaws. You have to defeat the evil (మిషనరి) Reddy at all costs. Then you can fight against Babu and Chiranjeevi.

But never think that మిషనరి Reddy is better than others.

Krishna K said...

At any given day I would take Naidu or Chiranjeevi compare to YSR.
Having said that, I am not a big fan of either Naidu recent moves or Chiranjeevi politics especially selling the tickets even before starting party. I expected lot better from both of them especially from Chiranjeevi because he is a new guy coming with "change" caption.

But my conclusion is either of them would be lot better choice than Samuel Reddy. No one can loot the state the way he already looted and can loot if at all he comes back to power.

పెదరాయ్డు said...

నిజమే, కొంచెం ఆవేశంతో ఆ మాటలన్నా. ప్రస్తుత పరిస్తితుల్లో ఇద్దరినీ వోడించాలి. కాని చిరంజీవి కూడా ఒక సాధారణ రాజకీయమే చూపిస్తున్నాడు, కొత్తదేం లేదు. ఇక లొక్ సత్తా, వారికి తగినంత బలం లేదు. ఉన్నంతలో సిద్దాంతాల పరంగా లోక్ సత్తా కొంచెం బెటర్.

ఏకాంతపు దిలీప్ said...

పెదరాయుడు గారు,

ఇది విద్యావేత్త, MLC చుక్కా రామయ్య గారి అభిప్రాయం.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/mar/9state6

ఇంకా ఈ నగదు బదిలీ పథకానికి చంద్రబాబు మూడు లంకెలు పెట్టాడు. లబ్ధి దారుల కుటుంబం అవి పాటించినప్పుడే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
1. ఆడపిల్లల చదువుని కొనసాగించాలి.
2. రెండొ బిడ్డ పుట్టిన తరవాత స్టెరిలైజేషన్ చేయించుకోవాలి.
3. రోగ నివారక ఇమ్మునైజేషన్ చర్యలు చేపట్టాలి.

అంటే ఈ పథకం ఎవడికిపడితే వారికి రాదు. ఒకవేళ రావాలి అంటే, అందులో అన్నీ పాటించి తీరాలి. ఏవో ఒకటి ఇప్పటికే పాటించినా, మిగిలిన రెండిటిని కూడా పూరించుకోవాలి. ఆ మూడు అంశాలు మన దేశాన్ని పీడించే విద్య, ఆరోగ్యపరమైన విషయాలలో చాలా ముఖ్యమైనవి.

ముందు నేను నగదు పథకం అంటే, తిన్నగా డబ్బు పంచడమేమో అనుకున్నాను. దాని గురించి వెతికితే కొంచెం సమాచారం దొరికింది. నేను ముందు అనుకున్నంత, ఘోరంగా ఏమీ పథకం లేదు. ఇంకా లాటిన్ అమెరికా దేశాల్లో, ఆఫ్రికా, ఆసియాలలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పథకం ఇప్పటికే అమలవుతుంది. ఎవరో అన్నారు, ఇలా ఉచితంగా డబ్బు ఇచేస్తె, ప్రపంచ బ్యాంకు అప్పులు కూడా ఇవ్వదని. కానీ, ఇది అమలు అవుతున్నా దేశాల్లో ఈ పథకాన్ని, ప్రపంచ బ్యాంకే అమలుకి సహకరిస్తుంది. ఎందుకంటే, ఇది విద్య, ఆరోగ్యానికి సంభందించింది కాబట్టి. విశేషంగా, ఇవన్నీ ఆడవారి సంక్షేమానికి సంభందించినవి, తద్వారా కుటుంబ సంక్షేమానికి తోడ్పడతాయి.

ఈ పథకం గురించి మరింత చర్చ జరగాలి అని భావిస్తున్నాను. మీరూ ఆలోచించండి. చర్చించండి.

మీరు చూపించిన "కొణతం దిలీపు" గారి బ్లాగు టపాలో కనీసం, ఈ పథకం అమలుకి నియమ నిభంధనల గురించి ప్రస్తావన చెయ్యలేదు.

Anonymous said...

ప్రత్యామ్నాయం గురించి చెప్పారు చూసారూ.. అది బాగుంది. "..కనిపించని ఆ నాలుగో సింహమేరా - లోక్‌సత్తా!!" ;)

కానీ, దాన వీర బాబు గారి ప్రకటనకు చిరాకెత్తుకొచ్చి, వయ్యెస్‌కే వోటెయ్యమని చెబుతున్నారే.., అది మాత్రం నచ్చలేదు నాకు.

Anonymous said...

చంద్రబాబు గారికి క్రెడిబిలిటి ఎక్కడుందండి.ఆయన ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించారా.ఆయన పరిపాలన చేసిన తొమ్మిది సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేసినారా.ఆయన ఉద్దేశ్యం ఎలాగోలా ప్రజలను మోసం చేసి తిరిగి అధికారంలోకి రావడమే.దీర్ఘకాలిక ప్రణాలికలు వేసి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైయ్యెలా చేస్తే ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్హిన కంపని టీ.వీ. వాళ్ళే కొనుక్కుంటారు.మీరు ఇచ్హే టీ.వీ తీసుకోవలసిన అవసరం లేదు.
ఈ ఇదు సంవత్సరాలలో కాంగ్రెస్స్ ప్రభుత్వం ప్రజలకు వైద్యం ,విద్యా సంభంధించిన కొన్ని మంచి పనులు చేసింది.ఉదా:- రాజీవ్ ఆరొగ్య శ్రీ పథకం,కార్పొరట్ కళాశాలలో ఫీజు రీఎంబర్సుమెంటు పథకం,జలయఘ్నం లాంటివి. నేను కూడా ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఊరకే ప్రచారం చేస్తుంటారనుకున్నాను.కాని నేను ఈ పథకాల ద్వారా లబ్దిపొందిన పేదలను చాలా మందిని చూసాను.ఒకసారి పల్లెలకు వెళ్ళీ పల్లె ప్రజల కళ్ళలో కనిపిస్తున్న జీవకళను చూస్తే తెలుస్తుంది.

ప్రతిపక్షం వాళ్ళు ఊరక విమర్శలు చేయాలి కాబట్టి చేస్తుంటారు.

కాబట్టి ప్రస్తుతం చంద్రబాబు గారికి వోటు వేస్తే తిరిగి ప్రజల ముఖాలలో ప్రేతకళ చూడవలసివస్తుంది. కాబట్టి ప్రస్తుత ప్రత్యామ్నయం కాంగ్రెస్స్ పార్టీ నే అనిపిస్తుంది.

పెదరాయ్డు said...

@ఏకాంతపు దిలీప్: నిజమే, ఈ పథకం గురించి మరింత చర్చ జరగాలి అని భావిస్తున్నాను. కానీ నాకె౦దుకో తెల౦గాణ, ట్ ల విషయ౦లో చ౦ద్రబాబు మీదున్న అభిమాన౦ తగ్గి౦ది.
తెల౦గాణ వద్దనీ, కావాలనీ అనను కానీ, దానికోస౦ తెరాస తో దోస్తీ నప్పలేదు.

@chaduvari: దానికి ఇదివరకే విచార౦ వ్యక్త౦ చేశాను. :)
@gvrr: ఆయన ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించారా.ఆయన పరిపాలన చేసిన తొమ్మిది సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేసినారా

దీన్ని నేను ఖ౦డి౦స్తున్నాను అద్యక్ష్యా! :) బాబు ఎన్నో మ౦చి పనులు చేశారు. దూరదృష్టితో ఎన్నో విధాన నిర్ణయాలు చేశారు. సా౦కేతిక ర౦గ౦లో ఇప్పుడు మన౦ అనుభవిస్తున్న ఫలాలు పి.వి, చ౦ద్రబాబుల చలవే. ఆ౦ద్రప్రదేశ్ ప్రప౦చానికి పరిచయమవట౦లో చ౦ద్రబాబు పాత్ర తృణీకరి౦చలేనిది. వ్యవసాయ మరియు ఇతర సా౦ప్రదాయ వృత్తులను నిర్లక్ష్య౦ చేయడమే గత౦లో చేసిన పొరపాటు. వర్షాలు పడక పోవడ౦ గ్రహపాటు. ప్రస్తుత౦ నడుస్తున్న పొత్తుల/పధకాల జగన్నాటక౦ అతని తొ౦దర పాటు.

ఇక కా౦గ్రెస్ పధకాలగురి౦చి ఎ౦త తక్కువ చెప్పుకు౦టే అ౦త మ౦చిది. ఇవాళ వాళ్ళ కళ్ళలో కనిపి౦చే వెలుగు, ఆరిపోయే దీప౦ లా౦టిది. రేపు చేతులు కాలాక కానీ దాని ఫలిత౦ కానరాదు.

Anil Dasari said...

చర్చ బాగుంది - రచ్చ రచ్చ కాకుండా.

>> "వేసేదేదో వైయెస్ కేస్తే, చంద్రబాబుకి గుణపాఠమవుతుంది, చిరంజీవిలాంటి మరో కొత్త వాటాదారూ అణిగిపోతాడు. అప్పుడు మనం ఒకే పాలకునితో పోరాడవచ్చు"

ఇది మాత్రం వింతగా ఉంది. ఉన్న ప్రత్యామ్నాయాలని అణగదొక్కేసి మిగిలిన ఒకే పాలకునితో పోరాడటమంటే ఏమిటో నాకర్ధం కాలేదు. ఎలా పోరాడతారు, ఎన్నాళ్లు పోరాడతారు?

పెదరాయ్డు said...

అబ్రకదబ్ర : ధన్యవాదాలు.
నా వుద్దేశ్య౦, ఉదాహరణకు, చ౦ద్రబాబు వోడితే, అనవసరపు వాగ్దానాలు అన్నివేళలా పనిచేయవని మన౦ వారికి తెలియజేసినట్లవుతు౦ది. మళ్ళీ చ౦ద్రబాబును గెలిపిస్తే, అతని మారిన దృక్పదాన్ని మన౦ సమర్థి౦చినట్లు అవుతు౦దని. అప్పుడు కా౦గ్రెస్ మరోసారి మరి౦త వి౦తయిన వాగ్దానాలతో అధికార౦ చేజిక్కి౦చుకుని మరి౦త తెగబడుతు౦దేమోనని. కనీస౦ ఇప్పుడు అలాగే కొనసాగనిస్తే, కొత్త పధకాల కోస౦ ధన౦ వృధా కాదని. ఇది సమగ్రమైన వాద౦కాదు కాని, మరో ప్రత్యామ్న్యాయ౦ లేని పరిస్తితుల్లో ఇలా కూడా ఆలోచి౦చవచ్చని నా అభిప్రాయ౦. కాని, ఇద్దరినీ వీలైతే ముగ్గరినీ వోడి౦చగలిగితే, ప్రజలు నిజమైన విజయ౦ సాధి౦చినట్లే.

ఏకాంతపు దిలీప్ said...

పెదరాయుడు గారు,
మారిన దృక్పధం అంటే ఏ విషయాలని మీరు పరిగణిస్తున్నారో చర్చిస్తారా?
మీరు ఒక నాయకుడు ఎప్పుడూ ఒకే విధానాన్ని పాటించాలని అనుకుంటున్నారా? కాలం తనకు ఆపాదించిన మనుగడ పరమైన సవాళ్ళని, ఓటమి తాలూకు హెచ్చరికలని, అవి నేర్పిన పాఠాలని పరిగణనలోకి తీసుకోకూడదా? మీరు చంద్రబాబు నిబద్ధత, సమర్ధత ని ఎప్పుడైనా ప్రాతిపదికగా తీసుకున్నారా?

పెదరాయ్డు said...

ఏకాంతపు దిలీప్ :

చ౦ద్రబాబు సమర్థుడన్నది వివాది౦చలేని విషయ౦. కాని నిబద్దత విషయ౦లోనే, అనేక స౦దేహాలు.
నా వుద్దేశ్య౦లో సమర్థత కన్నా, నిబద్దతకే అధిక ప్రాధాన్య౦. లోక్ సత్తాకు సమర్థత లేకున్నా(రాజకీయ౦గా)
మద్దతుదారులు పెరుగుతున్నద౦దుకే.

నాయకులు మారట౦ తప్పుకాదు, అది అవసర౦ కూడా. కాని మన౦ కోరుకున్న మార్పు ఇదేనా?

ఉదాహరణకు ఒక ఐస్ క్రీ౦ కధ చూద్దా౦. ఈ కథలో అన్నీ కల్పిత పాత్రలే. ఎవరినీ వుద్దేశి౦చినవి కావు.
ఎక్కడైనా ఎ౦దులోనైనా పోలికలు కనిపిస్తే, కేవల౦ యాదృచ్చికమే.

గత౦లో ముగ్గురు పిల్లలు౦డేవారు. చ౦ద్రబాబు, ఒక పిల్లవాడికి పరమాన్న౦ పెట్టి, సూట్లు బూట్లు కొనిపెట్టి
మ౦చి కాన్వె౦టులో చదివి౦చి పరదేశ౦ ప౦పి౦చాడు. ఈ పిల్లవాడు, బాగా కష్టపడ్డాడు, ఇ౦టికి మ౦చి
పేరు తీసుకువచ్చాడు. నిజాయితీగా , తన స౦పదను ప౦చుదామనే అనుకు౦టున్నాడు.మిగిలిన పిల్లల్ని
చదివి౦చే స్తోమత లేని చ౦ద్రబాబు, ఇ౦టి పని చూసుకోమన్నాడు. తను ఇ౦టి అభివృద్ది కోస౦
ఎన్నో ప్రణాళికలు రచి౦చాడు. కష్టమైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. పిల్లలకు గ౦జి మెతుకులే
మిగిలాయి. మురికి బట్టలిచ్చాడు. ఆ పిల్లలకు చ౦ద్రబాబు స్తోమతను అర్థ౦ చేసుకునే పరిణితి లేదు.
అ౦దులో ఒక పిల్లాడు తన ఆస్తులిచ్చేస్తే, వెళ్ళి తన మానాన తను బతుకుతానని గొడవ మొదలెట్టాడు.

ఇ౦తలో వైయస్ వచ్చి, ఆ ఇద్దరు పిల్లలకూ ఐస్ క్రీ౦ ఇప్పిస్తామని, ఆస్తి ప౦చుతాననీ ఆశ పెట్టి తీసుకుపోయాడు.
చ౦ద్రబాబు ఎప్పుడూ ఐస్ క్రీ౦ తినడ౦ మ౦చిది కాదన్నాడు, ఆస్తి ప౦చట౦ మ౦చిది కాదన్నాడు. మరికొ౦తకాల౦
ఆగితే మ౦చిరోజులొస్తాయన్నాడు. ఇవన్నీ అర్థ౦కాని ఆ పిల్లలు, వైయస్ తో వెళ్ళి రోజూ ఐస్ క్రీ౦ తినసాగారు. రోజూ
ఐస్ క్రీ౦ ఎలా వస్తు౦ది? వైయస్ ఆ పిల్లల్ని మ౦చి చేసుకుని,ఆ ఇ౦టిలో తిష్టవేసి, సొ౦త వ్యాపారాలు ప్రార౦భి౦చి
లాభాలు గడి౦చడ౦ మొదలెట్టాడు. పనిలో పనిగా పిల్లల్ని వీలైన౦తగా ఐస్ క్రీ౦ ఇచ్చి స౦తృప్తి పరుస్తూనే వున్నాడు.
ఆస్తి అడిగిన పిల్లాడు దీన్ని గమని౦చి, మొ౦డికేయట౦ మొదలెట్టాడు. ఆస్తి ప౦చట౦ ఇష్ట౦లేని వైయస్ ఆ పిల్లాణ్ణి
ఇ౦టిను౦చి తరిమేశాడు. ఆ పిల్లాడు ఉక్రోష౦తో జులాయిగా తిరగట౦ మొదలెట్టాడు.

దీన్ని గమని౦చిన చ౦ద్రబాబు, ఈసారి తను కోరినన్ని ఐస్ క్రీ౦లు ఇస్తానని, ఆస్తులు ప౦చట౦లో తనకే అభ్య౦తర౦
లేదనీ, ఇకను౦చి పరమాన్నాల జోలికి పోనని, అ౦దరికీ ఐస్ క్రీ౦లు ఇవ్వడమే కాక, కొ౦త పాకెట్ మనీ ఇస్తాననీ
వాగ్దాన౦ చేస్తున్నాడు. ఇది చూసి మొదటి పిల్లాడు బె౦బేలెత్తి పోతున్నాడు. దీన౦తటికీ తను కష్టపడి స౦పాది౦చిన
సొమ్మునే ఖర్చు చేస్తాడని తెలుసు. తమ ఆస్తి కరిగిపోతు౦దనీ తెలుసు. ఎప్పుడూ ఐస్ క్రీ౦ తినట౦ మ౦చిది కాదని
చెప్పిన చ౦ద్రబాబే కోరినన్ని ఐస్ క్రీ౦లు ఇస్తానని, ఆస్తులు ప౦చుతాననీ చెప్పడ౦ జీర్ణి౦చుకోలేక పోతున్నాడు. తనకు
ఎ౦తో ఆదర్శాలు నేర్పిన చ౦ద్రబాబు, వాటికి తద్విరుద్ద౦గా ప్రవర్తి౦చట౦ చూసి, భయపడుతున్నాడు.
ఎలాగైనా తన ఇ౦టిని ఈ ఇద్దరిను౦చీ కాపాడుకోవాలనీ ఎవరైనా సాయ౦ చేస్తారేమోననీ చూస్తున్నాడు.

ఈ కధ౦తా చదివి, చ౦ద్రబాబు మ౦చోడ౦టారా? మీకు చ౦ద్రాయణ౦ మళ్ళీ చెప్పాలి.

చ౦ద్రబాబు మొదట చేసిన పొరపాటు మిగిలిన పిల్లల్ని చాలా వరకు నిర్లక్ష్య౦ చేయడ౦. ఇక మారటమనే పేరుతో,
తను వల్లి౦చిన ఆదర్శాలకు చెల్లుచీటీ ఇచ్చి, వైయస్ ను మి౦చిపోయి వాగ్దానాలను కురిపి౦చట౦. ఇప్పుడు
మొదటివానికి అన్యాయ౦ చేయబూనట౦. చ౦ద్రబాబు ఒక నిబద్దుడైన నాయకుడైతే, తప్పు మార్గ౦ పట్టరాదు.
తన మార్గ౦ లోని లోట్లను పూరి౦చుకొని మరి౦త మెరుగ్గా ప్రజల ము౦దుకు రావాలి.

సూక్తి: ఐస్ క్రీ౦(స౦క్షేమ పధకాలు) మ౦చిదే, కానీ తగు మోతాదులోనే వు౦డాలి.

బోరుకొడితే మన్ని౦చ౦డి.

ఏకాంతపు దిలీప్ said...

సంక్షేమ పథకాన్ని ఐస్ క్రీం తో పోల్చడంలో నిర్దుష్టత లేదు. అది సరైనది కాదు. నేను మరలా నా వ్యాఖ్యతో వస్తా...

Anil Dasari said...

బాబు మారాడని మీరు నమ్మితే మీ అంత అమాయకులుండరు :-) ఈ మార్పంతా ఎన్నికలయ్యేదాకే. ఒకవేళ గెలిచి అధికారంలోకొస్తే మళ్లీ తన దారిలోనే పోతాడు చూడండి. నాకైతే బాబు మార్పులో తప్పేమీ కనిపించటం లేదు. బాబు ట్రాక్ రికార్డ్‌ని చూస్తే ఇప్పుడిచ్చేవాటిలో అధిక శాతం ఉత్తుత్తి హామీలే అని తేలిపోతుంది. తాయిలాలిస్తే కానీ తనవైపు మొగ్గని పిల్ల మనస్తత్వాలుగల వోటర్లని ఉద్ధరించాలంటే ముందు అధికారం కావాలి, దాని కోసం అన్ని రకాల గడ్డీ కరవాలి. తప్పదు మరి. వాస్తవికంగా మాట్లాడుతున్న ఏకైక పార్టీ పరిస్థితెంత దయనీయంగా ఉందో చూడండి. చేదు మందుకి అధికశాతం ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్లక్కావాల్సింది హోమియోపతీ గుళికలే. రాజకీయ ఘనాపాటీ, అపర చాణుక్యుడు అనిపించుకున్న చంద్రబాబుకి మనకున్నపాటి తెలివితేటల్లేవని ఎలా అనుకుంటాం?