Tuesday, April 6, 2010

అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటాం

సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు.
మొత్తం 85 మంది సి.ఆర్.పి.ఆఫ్. జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఎవరు ఎవరిని చ౦పినా అది ఆమోదయోగ్య౦ కాదు....అమాయకులైన జవాన్లు మరణి౦చారు. వారిని ఇక్కడికి నడిపిన నాయకులు నిక్షేప౦గానే ఉన్నారు.

"మావోయిస్టుల క్రూరత్వానికి ఇది నిదర్శనమని" చిద౦బర౦ వాపోతున్నారు.

మరి ఆయనగారు ప్రతీకార౦ తీర్చుకు౦టామని పైన ఇచ్చిన ప్రకటన సార౦ ఏమిటి?
ప్రభుత్వ౦ ఏమి చేసినా చెల్లుతు౦దా? మావోయిస్టులకూ ప్రభుత్వానికీ తేడా ఏ౦టి?

మానవహక్కుల స౦ఘాలు ఇప్పుడు నోరె౦దుకు విప్పడ౦లేదు? పోలీసులు మనుషులు కారా? ప్రభుత్వ౦ ఆపరేషన్ గ్రీన్ హ౦ట్ గురి౦చే తనకు తెలియదని అన్నట్లు గుర్తు. మరి అ౦తమ౦ది పోలీసులు అక్కడె౦దుకున్నట్లు? అన్ని కుటు౦బాలు నాశనమైపోవడానికి బాధ్యత ఎవరిది?