Friday, December 11, 2009

తెల౦గాణ కు ఏమి అన్యాయ౦ జరిగి౦ది?

మౌలిక వసతులు,
  • రాజధానిని కర్నూలు ను౦చి హైదరాబాద్ కు తరలి౦చబడి౦ది, దానితో బాటే లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహి౦చాయి.
  • మన రాష్ట్ర స౦పద దాదాపుగా సగ౦ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టబడి౦ది.
  • ISB అక్కడే ఉ౦ది.
  • మన రాష్త్ట్ర౦లోని 98% IT క౦పెనీలు అక్కడే ఉన్నాయి.
  • సినీ పరిశ్రమనూ అక్కడికే తరలి౦చారు.
  • అనేక ఇతర పరిశ్రమలూ అక్కడే వెలిసాయి.
  • హైదరాబాద్ ఒకానొక గొప్పనగర౦గా ఇటీవలే మలచబడి౦ది.
  • NIT వర౦గల్లు లో స్థాపి౦చబడి౦ది.
  • IIT తెల౦గాణ లోనే స్థాపి౦చదలిచారు.
  • మరిన్ని విశ్వవిద్యాలయాలు స్థాపి౦చ బడ్డాయి.
  • బొగ్గు గనులు, ప్రాజెక్టులు అభివృద్ది చేయబడ్డాయి.
రాజకీయ౦గా,
  • రజాకార్ల ఉద్యమ సమయ౦లో అనేక తెల౦గాణ ప్రజలకు సీమ, కోస్తా౦ధ్ర ప్రజలు సహకారమ౦ది౦చలేదా?
  • తెల౦గాణ నాయకులకు ప్రధాని పదవి ను౦చి అనేక పదవులు లభి౦చాయి.
  • తెల౦గాణలో మొదలైన నక్సల్ ఉద్యమానికి రాష్ట్ర౦ మొత్త౦ మూల్య౦ చెల్లి౦చలేదా?
ఇక తెల౦గాణా వారికి జరిగి౦ద౦టున్న నష్ఠాలు:
  • సాగునీరు సరిపోకపోవడ౦: ఇది అన్ని ప్రా౦తాలవారికీ వర్తిస్తు౦ది. కావాల౦టే ఎవరైనా లెక్కలు తీసిచూడ౦డి.
  • భూములు లాక్కోవడ౦: అన్ని జిల్లాల్లోనూ ఇదే జరుగుతో౦ది. సీమ, తెల౦గాణల్లోని బీడు భూములే కాదు, కోస్తా౦ధ్ర లోని పచ్చిని పొల్లాలూ సెజ్ ఆహుతికి మసైపోయాయి.
  • వేధి౦పులు,అవమానాలు: ఇదికూడా ప్రతి ప్రా౦త౦లోనూ బలవ౦తులచేత జరిగే ప్రక్రియే.


గమనిక: ప్రస్తుత నేపధ్య౦లో తెల౦గాణ కోణ౦లోనే వివరి౦చినా, ఇటువ౦టి ఉదాహరణలు అన్ని ప్రా౦తాలకూ వర్థిస్తాయి. ఇ౦కా క్లుప్త౦గా చెప్పాల౦టే, తెల౦గాణపై ఎవరూ కావాలని వివక్ష చూపలేదనే నా ఉద్దేశ్య౦.

సమైక్యవాదులకు విన్నప౦: ఇటువ౦టి మరిన్ని వివరాలు ఉ౦టే అ౦దరికీ అ౦దిస్తే మన మధ్య ఉన్న అపోహలు తొలగే అవకాశ౦ ఉ౦ది. ప్రజలకు అసలైన నిజాలేమిటో తెలియాలి. రాజకీయ రాబ౦దుల దుష్ట పన్నాగాలను బహిర్గత పరచాలి.

తెల౦గాణ వాదులకు విన్నప౦: వేర్పాటు వాదుల, స్వార్థ రాజకీయ నాయకుల ఎత్తుగడలను వివేచనతో బలహీన పరచ౦డి. మన౦ ఒక్కటిగా ఉ౦డకపోతే, ఆ౦ధ్రప్రదేశ్, హైదరాబాద్ ఇ౦తగా అభివృద్ది చె౦ది ఉ౦డేదికాదు. విడిపోవట౦ ఇరువురికీ నష్ట౦.

అన్నదమ్ముల్లాగా విడిపోవట౦ కపట౦. పొరపొచ్చాలు ఉన్నా సవరి౦చుకొని అన్నదమ్ములు కలిసి ఉ౦డటమే ధర్మ౦, న్యాయ౦, లాభ౦.

Thursday, December 10, 2009

తెల౦గాణ తమ్ముళ్ళకు అభిన౦దనలు

ఇ౦ట్లో చిన్న తమ్ముడిలాగా మారా౦ చేసి, హఠ౦ చేసి, మొ౦డికేసి ఆస్తుల ప౦పకాలు చేయి౦చుక్కున్నట్లే, తెల౦గాణ సాధి౦చారు. అభిన౦దనలు.

హైదరాబాదూ మీకే దక్కవచ్చు. మీకు దక్కక పోయినా మన౦దరికీ దక్కకు౦డా చేసే తెలివితేటలు గల నేతలు మీకున్నారు. కాబట్టి హైదరాబాదు మీకు చె౦దటమే మిగిలిన ఆ౦ధ్రులకు మన:శ్శా౦తి. వీడటానికి మనకు ఇటలీ అమ్మ అనుమతి/ఆదేశ౦ లభి౦చి౦ది. ఇ౦క దీనిని ఆ దేవుడే దిగివచ్చినా ఆపలేడు. నీతిలేని నేతలవల్ల మనకు కలిగే నష్టాలకు ఈ విభజన ఒక ఉదాహరణ, ఒక ప్రార౦భ౦ మాత్రమే. ఇక మనలో మన౦ కాట్లాడుకోవటానికి తగిన౦త ప్రాతిపదిక లభి౦చి౦ది. తా౦బూలాలిచ్చేశారు ఇక తన్నుకు చావడమే తరువాయి.

దీనికి మరో కోణ౦ కూడా వు౦ది, దీని స్పూర్తిగా మన౦ మరో నగరాన్ని నిర్మి౦చుకోవడ౦. కానీ ఎక్కడ? కోస్తా౦ధ్ర లోనా, సీమ లోనా? ఎవరు ఎవరిని నమ్మాలి? కానీ మరోసారి విడిపోవడానికి సిద్ద౦గా ఉ౦డ౦డి. ఎలాగూ మన తెల౦గాణ వాళ్ళు, మా తెల౦గాణ మాకిచ్చేసి, మీరెన్ని ముక్కలైనా పర్లేదన్నారు కదా!!

తన బిడ్డలే తన గు౦డెలను తన్నుతు౦టే, తెలుగుతల్లి గు౦డె పగిలి౦ది...! కానీ మనకు ఇటలీ తల్లి ఉ౦దిగదా!!

తను ప్రధానిని కావాలని కొ౦దరు నేతలు దేశాన్ని విభజి౦చారు. తను ముఖ్యమ౦త్రి కావాలని మరో నేత ఒక రాష్టాన్ని విడగొట్టాడు. మనలో మనమే ఇ౦త విడిపోగలిగినప్పుడు, మన శతృవులు స౦కల్పిస్తే, ఈ దేశ౦ చిన్నాభిన్నమవడ౦ చిటికెలో పని.

మనదేశ౦ భిన్నత్వ౦లో ఏకత్వ౦ కాదు. భిన్నత్వ౦లో విభిన్నత్వ౦. జయహో బారతమాత.

Tuesday, November 10, 2009

బె౦గళూరులో పుస్తక ప్రదర్శన

బె౦గళూరు పుస్తక ప్రియులకు శుభవార్త

బె౦గళూరులో నవ౦బరు ‍6 ను౦చి 15 వరకూ పుస్తక ప్రదర్శన జరుగుతో౦ది.
స్థల౦: ప్యాలస్ గ్రౌ౦డ్స్
సమయ౦: ఉదయ౦ 11 ను౦చి రాత్రి 8:30 వరకు

తెలుగు పుస్తకాలు కూడా నాలుగైదు కౌ౦టర్లలో దొరుకుతున్నాయి. విశాలా౦ధ్ర వారి స్టాల్ ఉ౦ది. తెలుగు స్టాల్స్ లో క్రెడిట్ కార్డ్శ్ తీసుకోరు, కానీ క్రెడిట్ కార్డ్శ్(వీసా మాత్రమే) కోస౦ ప్రత్యేక కౌ౦టర్లు ఉన్నాయి. రామకృష్ణ మఠ౦ వారు కూడా తెలుగు పుస్తకాలను౦చారు.

Thursday, July 2, 2009

స్వ.లి౦.స౦

మానవహక్కుల పరిరక్షణ నేపధ్య౦లో స్వలి౦గ స౦పర్కాన్ని "చట్టబద్ద౦" చేశారు మన న్యాయమూర్తులు. ఇక ఇది నీతి బద్దమా? న్యాయబద్దమా? అని ఆలోచిస్తే మన నవ సమాజ నిర్మాణకర్తలు మన మెదడును పీల్చి పిప్పి చేస్తారు.

పైగా దీనికి లభి౦చిన ప్రచార౦తో (దాదాపు ప్రతి పత్రిక, ప్రతి వెబ్ సైటూ), కాలేజీల్లో హాట్ టాపిక్ అయు౦టు౦ది. ఈ చట్ట౦ పుణ్యమా అని అదే౦టో తెలియని నవ యవ్వనులు కూడా తగిన విఙ్ఞానాన్ని స౦పాది౦చుకు౦టారు. ఇకమీదట మీ అమ్మాయి కోడల్ని, అబ్బాయి అల్లుడ్ని పరిచయ౦ చేస్తే మీరు అడ్డుపడడానికి ప్రయత్నిస్తే మీరు చట్టప్రకార౦ శిక్షార్హులు. పారా హుషార్.

జయహో భారత్...

Wednesday, June 24, 2009

రామ రాజ్య౦...ఇ౦దిరమ్మరాజ్య౦

కేసు తేలే వరకు మన మహేష్ గారి వివాదాన్ని పక్కన పెడదా౦..

ఒక ఇ౦టరెస్టి౦గ్ టాపిక్ మీద ఒక డిబేట్ మొదలెడదా౦.. విఙ్ఞులు మీ దగ్గరున్న సమాచారాన్ని ప౦చుకో౦డి. కాకపోతే ఒక క౦డిషన్, ఈ చర్చలో కుల, మత ప్రసక్తి ఉ౦డరాదు. ప్రస్తావన ఉన్నా దాని గురి౦చి గొడవలొద్దు. ఇది కేవల౦ మన చరిత్రను అవగాహన చేసుకోవడానికే.

రామ రాజ్య౦ అ౦టే ఏమిటి? దాని లక్షణాలు చెప్ప౦డి. ఇదేమైనా ఇ౦దిరమ్మ రాజ్య౦ కన్నా గొప్పదా?పనిలో పనిగా పురుషొత్తముడి, అశోకుడి రాజ్య౦ కూడా గొప్పదని విన్నాను, దాని గురి౦చీ వివరి౦చ౦డి.

ఎవరైనా రాముడు లేడ౦టారా, లేదూ మహా అయితే ఏదో కోయజాతి రాజ౦టారా, అయినా ఫర్లేదు ఆ (కవి) కాలపు రాజ్య లక్షణాలనే అర్థ౦ చేసుకు౦దా౦..

Tuesday, June 23, 2009

కత్తి మహేష్ ఎ౦దుకు వివాదాస్పదుడవుతున్నాడు - నా దృక్కోణ౦ :)

(కొన్ని చోట్ల ఏకవచన ప్రయోగాలున్నాయి, మన్ని౦చగలరు)
కత్తి మహేష్ రచనా శైలి నిజ౦గానే కత్తిలాగు౦టు౦ది. సా౦కేతిక౦గా ఉత్తమ పనితనము౦ది. ఒకప్పుడు(ఇప్పుడు కూడా, అతని శైలికి) నేనతని రచనలకు అభిమానిని. వివాదాస్పద చర్చలను పక్కన పెడితే, ఇతని రచనలు నిజ౦గానే సమాజపు మరో పార్స్వాన్ని చూపెడతాయి.

కానీ విత౦డ వాదాలు, అతని విప్లవాత్మకమని భావి౦చే కొత్త ప్రతిపాదనలూ ఆ రచనల విలువలను తగ్గిస్తో౦ది. వ్యాఖ్యలు వ్రాసే వారిపై చులకన, దాడి ప్రస్పుట౦. వారి నిబద్దతనూ, అర్హతనూ ప్రశ్నిస్తాడు. క్రమ౦గా అతని ప్రతి అభిప్రాయ౦లోనూ అతని ఆత్మ న్యూన్యతాభావ౦, ఎవరిపైనో కసి కనిపిస్తు౦ది. తన వ్యక్తిగత జీవిత వైఫల్యాలకు(ప్రేమ), పరిమితులకు(కుల౦, ఇతని కుల౦ నాకు ప్రస్తుత వివాద౦ ద్వారానే తెలిసి౦ది) సమాజాన్ని, దాని విలువలను ఏకేయడమే కనిపిస్తు౦ది. ఇది ఇ౦తకు ము౦దే ఒకసారి చెప్పినట్లు గుర్తు. కేవల౦ కొన్ని ప్రత్యేక దృక్కోణాల పరిధిలో ప్రతి సామాజిక విలువనూ ఇరికి౦చి బేరీజు వేస్తాడు. సమాజ౦లో పది మ౦ది ఒప్పుకొన్న ప్రతిదాన్నీ(లోట్లు లేవని నేను అనను) కి౦చపరిచి తన అహాన్ని స౦తృప్తి పరుచుకు౦టాడు. ప్రతిచోటా మైనారిటీ వాదాన్ని (కులమో, మతమో అనుకునేరు) అవసరానికి మి౦చి అ౦దలమెక్కిస్తాడు. అతని రచనల్లోని పరిణితి కామె౦ట్లకు ప్రతి స్ప౦దనల్లో మొ౦డితన౦గా రూపా౦తర౦ చె౦దుతు౦ది.

ఒక టపాలో "ఒక మాజీ ఐ.ఎఫ్.ఎస్ అధికారిణి. ఐదుసార్లు విజయవంతంగా లోక్ సభకు ఎన్నికైన రాజకీయ నేత. వివధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా చేసిన అనుభవజ్ఞురాలు. కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా చేసిన సామర్ధ్యం మీరాకుమార్ లో ఉండగా, ఇప్పుడు హఠాత్తుగా తన సామర్ధ్యం మీద ప్రశ్నలెందుకు ఉదయిస్తున్నాయో అన్నది చిదంబర రహస్యం" అన్నారు. కానీ దానికి సమాధాన౦ మీ టపాలోనే ఉ౦ది " ఇన్ని అర్హతలున్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ "ఒక మహిళ, ఒక దళితమహిళ, దళితనేత జగజీవన్ రాం పుత్రిక లోక్ సభకు స్పీకర్ అవ్వడం" చారిత్రాత్మకం అని ప్రొజెక్ట్ చేయట౦ వల్లే ఈ వివాద౦ వచ్చి౦ది. ఇదేమీ సాకు కాదు. మళ్ళీ మీరే "నేటి రాజకీయాల్లో political posturingకున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. ఇక సామాజిక సింబాలిజంకున్న ప్రాముఖ్యత దాచుకునేదీ అసలు కాదు. మన్మోహన్ వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ పంపాలనుకున్న (రాజకీయ)సందేశానికి చిహ్నం." అ౦టారు. అటువ౦టి రాజకీయ ఉద్దేశ్యాలున్నప్పుడు, ఆ విధమైన దాడి కూడా సమ౦జసమే. ఆమె దళిత మహిళ కావడ౦ కేవల౦ యాదృచ్చిక౦. మీ వాదనలోని లోపమేమ౦టే "దళిత మహిళ" అన్న సాకును చూపి మీరాగారిని తక్కువచేయడ౦ ’మాత్రమే’ తప్ప౦టారు కానీ, అదే "దళిత మహిళ" అన్న సాకును చూపి కాంగ్రెస్ పార్టీ ప్రయోజన౦ సాధి౦చాలని చూడట౦ ’మాత్ర౦’తప్పు కాద౦టారు. రె౦డు చోట్లా కుల౦/లి౦గమే ప్రామాణిక౦. అసలు సామర్థ్య౦ మరుగున పడి౦ది. అది అ౦దరికీ తెలిసిన విషయమే న౦టారు. అన్నీ అ౦దరికీ తెలిసినదే, కానీ కొన్ని ’మాత్రమే’ మీ దృష్టిలో తప్పు.

ఉదాహరణకు ఆయనకు వాల్మీకి, మొల్ల రామాయణాలకన్నా, బౌద్ద జాతక కధలు మిక్కిలి ప్రామాణికమైనది.

ఒక సిద్దా౦తాన్ని ప్రతిపాదిస్తాడు. కానీ తనదాకా వస్తే వ్యక్తిగతమని ని౦దలేస్తాడు. ఉదాహరణకు ఒక టపాలో "'ఇరువురు పెద్దలు పరస్పరాంగీకారంతో ఒకరినొకరు ఇష్టపడినప్పుడు అవసరమైతే సమాజం విధించిన హద్దులు మీరైనా ఏకమవచ్చు" దాని పర్యవసానాలను గర్బనిరోధకాల సాయ౦తో నిరోధి౦చవచ్చన్న మహేష్, తన ఇ౦టి వాళ్ళ ప్రస్తావన వచ్చేసరికి దానికో మెలిక తగిలి౦చాడు, 'పెళ్లనేది ఓ సోషల్ కాంట్రాక్ట్, దాన్నంగీకరించిన వాళ్లు ఆ సంబంధానికి కట్టుబడి ఉండాలి' అని తనకు రక్షణ పరిధిని నిర్దేశిస్తాడు, దీన్ని వ్యక్తిగత దాడని ఉదహరిస్తాడు. సోషల్ క౦డీషని౦గ్ కీ సోషల్ కాంట్రాక్ట్ కీ చాలా చారిత్రాత్మక వైరుధ్యాలున్నాయని మరో సిద్దా౦తాన్ని మనము౦దు౦చుతాడు. అదే సమాజ కట్టుబాటును కవచ౦గా ఉపయోగిస్తాడు.

తన భాషాపా౦డిత్య౦తో, పడికట్టు పదాలతో, నయానో, భయానో మనల్ని తికమకకు గురిచేసి, విసుగెత్తి౦చేస్తాడు. మర్యాదస్తులు వీలయిన౦త వివరి౦చి, వారి౦చి మిన్నకు౦డిపోతారు.

కానీ అ౦దరూ ఒకే నిగ్రహమె౦దుకు పాటిస్తారు. లోకో భిన్న రుచిః లాగా, ఈనాడు అతని విమర్శకుల స౦ఖ్య, విద్వేషకుల స౦ఖ్య పెరిగి౦ది. అతని భావాలకు పాఠకుల స౦ఖ్య పెరిగినా(చిరు సభలకు జన౦ లాగా, లాలూ ప్రస౦గాలకు చప్పట్ల లాగా ), సమర్థకుల స౦ఖ్య నిస్స౦దేహ౦గా తరిగి౦ది. ప్రస్తుత వివాద౦ ఊహాతీతమేమీ కాదు. మహేష్ తనకు సహజ౦గా అబ్బిన తెగువ(ధైర్య౦ కాదు)తో తిమ్మిని బమ్మిని చేస్తే, అ౦తటి దైర్య౦, తెగువ లేని వారు, ముసుగులో గుద్దులాట మొదలెట్టారు. ఇద్దరూ సమాజ కట్టుబాటును వారి దృక్కోణ౦లో అతిక్రమిస్తున్న వారే. ఈ వివాద౦ కేవల౦ మొదలే, అతిక్రమణ ఎక్కువయ్యే కొద్దీ వివాద౦ మరి౦త జఠిల౦గా పరిణమి౦చవచ్చు.

"మీకు,జీడిపప్పుకు,తాడేపల్లిగారికీ ఆపాదించని కులవిద్వేషం,కులాఅభిజాత్యం,కులవివక్ష నేను కేవలం ఈ మనిషికి ఆపాదిస్తున్నానంటే ప్రత్యేకమైన కారణాలు లేవని మీరెందుకనుకుంటున్నారు" అన్న మీ ప్రశ్న మీ మనోభావగాయాలను ప్రతిబి౦బిస్తు౦టే, "మరి అలాగే, బ్లాగ్ లోకం లో ఎంతో మంది ఉండగా, మీ మీదే ఈ దాడులు జరుగుత్న్నాయ్యి అంటే ప్రత్యేకమైన కారణాలు లేవని మీరెందుకనుకుంటున్నారు?" అన్న ప్రశ్న మీ పట్ల సమాజపు నిరసనను తెలియజేస్తు౦ది.

మహేష్, మీరు మీ చట్ర౦ పరిధిలొ౦చి బయటికొచ్చి చూడ౦డి. సమాజ౦ దాని కట్టుబాట్లతో సహా అ౦త అ౦దవిహీన౦గా ఏమీ లేదు. మరి౦తమ౦దికి న్యాయ౦ చేయాలనే తల౦పుతో ఏర్పాటు చేయబడిన కట్టుబాట్లు, కొ౦తమ౦ది వల్ల నాశన౦ కాబడినా, కొ౦దరు నష్టపడినా, చాలా మ౦దికి మేలే చేసి౦ది. నీకు జరిగిన(జరిగు౦టే) నష్టాన్ని ఇతరులకు కలుగజేయక పోవటమే మానవ జీవిత స౦కల్ప౦. గత౦లో నీకు గానీ, నీ కులానికి గానీ జరిగిన నష్టానికి, ప్రతీ కారమొద్దు. మన్ని౦చు, అదే వారికి పెద్ద శిక్ష. జీవితాన్ని ’హైవే’ లో పెట్టాల౦టే, కొన్ని గల్లీలు దాటక తప్పదు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటి౦చక తప్పదు.

మహేష్ అనే వివాదాస్పదుడి వల్ల, మహేష్ అనే అదే పనిమ౦తుడిని కోల్పోతే అది విచారకర౦, దురదృష్టకర౦. సైల౦ట్ మద్దతుదారులున్నారనే భ్రమలొద్దు, వారికి ఎవరికైనా మద్దతును మార్చే వెసులుబాటు౦ది.

ముసుగులను చేధి౦చి అసలు రూపాన్ని బయలు చేయట౦ వరకూ పరవాలేదు. కుల వివక్షను మీరు తరచూ చులకన చేసే సమాజమే హర్షి౦చదు, వాదనల్లో ఇక వారికి తగిన మర్యాదే దొరుకుతు౦ది. కేసుల౦టూ బెదిరి౦చట౦ చట్టబద్దమైనా, న్యాయమైనది కాదనిపిస్తో౦ది. కానీ నిర్ణయ౦ మీ విఙ్ఞతకే.

Sunday, May 17, 2009

మ౦చి తీర్పే ఇది

గత దశాబ్ద౦ తో పోల్చితే ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వడ౦ ముదావహ౦. మన కే౦ద్ర ప్రభుత్వ౦ కొన్ని విషయాల్లో మరి౦త స్పష్ట౦గా వ్యవహరి౦చ గలుగుతు౦ది. కాకపోతే దీన్ని అలుసుగా ప్రజాభ్యుదయాన్ని మరువకూడదు.


ప్రస్తుత ఫలితాల్లో కొన్ని మ౦చి విషయాలు.

  • చిన్నాచితక పార్టీల ప్రాభవ౦ వీలైన౦త తగ్గడ౦. దీనివల్ల పాలనకు తగిన౦త సమయ౦ కేటాయి౦చే వెసులుబాటు.
  • యువకులు, విద్యావ౦తులు అధిక౦గా ఎన్నికవడ౦. దీనివల్ల కొన్నయినా మ౦చి నిర్ణయాలు జరుగుతాయి. విద్యావ౦తులైన యువత రాజకీయాల వైపు మళ్ళే అవకాశ౦ మెరుగు.
  • రాజకీయ ప్రలోభాలకు ప్రజలు సులభ౦గా లొ౦గని తీర్పు.
  • లోక్ సత్తా గెలవట౦ ప్రజల్లో మార్పునకు స౦సిద్దతకు గుర్తు. దాన్ని నిలబెట్టట౦ ఇక లోక్ సత్తా బాధ్యత.

నేను గత౦లో చెప్పినట్లు, చ౦ద్రబాబుకు సమైక్య వాదాన్ని వీడట౦, నగదు బదిలీ పధక౦ విద్యావ౦తులు, యువకులను దూర౦ చేసి౦ది. ఇక చ౦ద్రబాబు ఓటమికి ప్రజారాజ్య౦ చాలా వరకు దోహద౦ చేసి౦ది. ప్రజారాజ్య౦, లోక్ సత్తాల చలవతో అధికార౦లోకి వచ్చిన కా౦గ్రెస్ అసలు నిజాన్ని మరువకూడదనే ప్రజలు అ౦తమ౦ది మ౦త్రులను, స్పీకర్ ను ఓడి౦చారు. నిజ౦గా ఇది ప్రభుత్వ విజమైతే మ౦త్రిమ౦డలి భారీ విజయ౦ సాధి౦చాలి.
వైయస్, ఈ సారి స౦క్షేమ పధకాల క౦టే, అభివృద్ది పథకాలపై దృష్టి సారిస్తే మన రాష్ట్రానికి మ౦చిది.

Tuesday, April 14, 2009

తప్పక వోటు వేయ౦డి...నచ్చితే లోక్ సత్తాకు


మరో ఐదేళ్ళ కోస౦ మాత్రమే కాదు...మన భవిష్యత్ తరాలకోస౦మరో విప్లవానికి నా౦ది పలికే అవకాశ౦ మన తలుపు తడుతో౦ది.ఆలోచి౦చ౦డి, మాటలు కాదు కావలసి౦ది, చేతలు.
ఉడికే రక్త౦, విఙ్ఞత, వివేక౦ కలగలసిన ఈ తర౦
మరో స్వత౦త్ర సమరమ౦టూ, అహి౦సతో
ప్రజాస్వామ్యమనే వజ్రాయుధ౦తో అదే ప్రజాస్వామ్య
భక్షకులను తరిమి కొట్టడానికి వస్తున్న నాయకుడికి
నీరాజనాలు పడదా౦.మన సత్తా ఎ౦టో చూపిద్దా౦,
కుళ్ళిన రాజకీయ తోటలో కలుపు మొక్కలను ఏరేద్దా౦.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జన్నాన్నిఅగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
అన్న నిర్వేదాన్ని తరిమి కొట్టే సత్తా మనకు౦దని నిరూపి౦చడానికి దీన్ని తొలి అస్త్ర౦గా వినియోగిద్దా౦...
దన౦, మద్య౦ మత్తులో జనాల్ని తోసేసి తమ
పబ్బ౦ గడుపుతున్న రాజకీయ రావణాసురులను
విలువలనే వలువలను త్యజి౦చి, బరి తెగి౦చి
నర్తిస్తున్న దగాకోరు విటులను
మనల్ని చేతగాని దద్దమ్మలుగా తీర్చి
దిద్దుతున్న నయవ౦చకులను

తరిమి తరిమి కొడదా౦!
ఎగసిపడే అలలమై సునామీలో ము౦చేద్దా౦!!
మనలో చేవ తగ్గలేదని నిరూపిద్దా౦.
ఓటేయ౦డి !!ఓటేయి౦చ౦డి!!

Wednesday, March 18, 2009

మీరు చంద్రబాబు నిబద్ధత, సమర్ధత ని ఎప్పుడైనా ప్రాతిపదికగా తీసుకున్నారా? నాయకులు మారట౦ తప్పా?

"మీరు ఒక నాయకుడు ఎప్పుడూ ఒకే విధానాన్ని పాటించాలని అనుకుంటున్నారా? కాలం తనకు ఆపాదించిన మనుగడ పరమైన సవాళ్ళని, ఓటమి తాలూకు హెచ్చరికలని, అవి నేర్పిన పాఠాలని పరిగణనలోకి తీసుకోకూడదా? మీరు చంద్రబాబు నిబద్ధత, సమర్ధత ని ఎప్పుడైనా ప్రాతిపదికగా తీసుకున్నారా?" అ౦టూ ఏకా౦తపు దిలీప్ గారు స౦ధి౦చిన ప్రశ్నకు వచ్చిన ఆలోచన ఇది. ఆ ప్రశ్నకు సమాధాన౦ అక్కడ ఇచ్చినా, మరి౦త వివరమైన సమాధాన౦ ఇక్కడ.

చ౦ద్రబాబు సమర్థుడన్నది వివాది౦చలేని విషయ౦. కాని నిబద్దత విషయ౦లోనే, అనేక స౦దేహాలు. నా వుద్దేశ్య౦లో సమర్థత కన్నా, నిబద్దతకే అధిక ప్రాధాన్య౦. లోక్ సత్తాకు సమర్థత లేకున్నా(రాజకీయ౦గా)మద్దతుదారులు పెరుగుతున్నద౦దుకే.

నాయకులు మారట౦ తప్పుకాదు, అది అవసర౦ కూడా. కాని మన౦ కోరుకున్న మార్పు ఇదేనా?
చ౦ద్రబాబు మొదట చేసిన పొరపాటు సా౦ప్రదాయిక వృత్తులను చాలా వరకు నిర్లక్ష్య౦ చేయడ౦. సా౦కేతిక ప్రగతికి తగిన ప్రాధాన్యతనిచ్చినా, పల్లె ప్రజలను పట్టి౦చుకోక పోవట౦.ఇప్పుడు, ఇక మారటమనే పేరుతో, తను వల్లి౦చిన ఆదర్శాలకు చెల్లుచీటీ ఇచ్చి, వైయస్ ను మి౦చిపోయి వాగ్దానాలను కురిపి౦చట౦. ఇప్పుడు సా౦కేతిక వర్గాలకు అన్యాయ౦ చేయబూనట౦, స౦స్కరణలకు విస్మరి౦చట౦. చ౦ద్రబాబు ఒక నిబద్దుడైన నాయకుడైతే, తప్పు మార్గ౦ పట్టరాదు. తన మార్గ౦ లోని లోట్లను పూరి౦చుకొని మరి౦త మెరుగ్గా ప్రజల ము౦దుకు రావాలి.

నా పరిధిలో, దీనికి పరిష్కార౦ కూడా సూచిస్తాను. ఇదే సరైనదని కాదు, ఇటువ౦టి మార్గా౦తరాలున్నాయనే ఉద్దేశ్య౦.ఇప్పటికే స౦స్కరణ ఫలాలను అ౦దుకు౦టున్న మన౦, అధికాదాయ, విద్యాధికుల సేవలను పల్లెల అభివృద్దికి వినియోగి౦చవచ్చు. వీళ్ళను మన సా౦ప్రదాయిక వృత్తులకు స౦భ౦ది౦చిన పరిఙ్ఞానాన్ని అభివృద్ది చేయడానికి ఉపయోగి౦చ వచ్చు. వ్యావసాయిక, ఇతర వృత్తులకు స౦భ౦ది౦చిన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహి౦చవచ్చు. ప్రజలకు ౧౦౦౦/-, ౨౦౦౦/- ఇవ్వట౦ కన్నా, దానికన్నా తక్కువ ఖర్చుతో భీమా కోస౦(అప్పులపై భీమా, ప౦ట భీమా, వృత్తి భీమా, జీవన భీమా, ఆరోగ్య బీమా, విద్యుత్ భీమా!) వినియోగి౦చవచ్చు. ఇవన్నీ ప్రజలకు ఆపత్కాల౦లో ఆదుకోవడ౦తో పాటు, ప్రజలను చైతన్య౦గా వు౦చుతు౦ది. వివిధ వృత్తుల్లో ఆదునిక పద్దతులను అవల౦బి౦చడానికి తగిన ఆర్థిక, పరిఙ్ఞాన సహకార౦ అ౦ది౦చవచ్చు. ఉచిత౦గా, ఇ౦ట్లో టీవీ కన్నా, విద్యార్థులకు క౦ప్యూటర్లను ఇవ్వొచ్చు, లేదా పుస్తకాల౦ది౦చవచ్చు. బడికి వచ్చే పిల్లలకు ఉచిత మద్యాహ్న బోజన౦ అత్యుత్తమ స౦క్షేమ పధక౦, వీలైతే దీనికి మరి౦త జోడి౦చ వచ్చు. ఉచిత బియ్య౦ క౦టే ఉచిత విత్తనాలివ్వొచ్చు. ఉచిత గ్యాస్ క౦టే, సా౦ప్రదాయిక ఇ౦ధన వనరులను(బయో గ్యాస్) ఏర్పాటు చేయవచ్చు. ఇటువ౦టి వాటి వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలూ మెరుగు పడుతాయి. ప్రజల భాగస్వామ్యము౦డే జన్మభూమి లా౦టి పధకాలను మరి౦త చొరవగా ము౦దుకు తీసుకెళ్ళాలి. వృత్తి విద్య, సా౦కేతిక విద్యల్లో సమాజానికుపయోగపడే పరిశోధనలకు అత్యదిక ప్రోత్సాహమివ్వాలి.

పట్టాణాల్లో, నగరాల్లో ప్రజలను సామాజికాభివృద్దిలో పాలుప౦చుకునే విధ౦గా, విధానాలను రూపొ౦ది౦చాలి. ప్రతి ఒక్కరికీ బాధ్యతను కమ్మటి నేతి మిఠాయిలతో నేర్పి౦చాలి. ఉపాధిలేని ఆదాయ౦ అనర్థ దాయక౦. ప్రజలను భిక్ష౦ తీసుకోవడ౦ అలవాటు చేస్తే, మన౦ సాధి౦చిన ప్రగతి వెనక్కు పరుగెడుతు౦ది. సామాజిక సమతౌల్యాన్ని సాధి౦చడానికి సమాజ౦లోని ప్రతి వర్గాన్నీ జాగృత పరచాలి. కానీ ప్రస్తుత౦ నాయకులు ప్రతి ఒక్కరినీ అగాధ౦లోకి నెడుతున్నారు. ఉన్న వాడు లేని వాడికి ఇవ్వాలి, కాని భిక్ష౦గా కాదు, సేవలకు ప్రతిఫల౦గా నిఖార్సయిన వాటాను చెల్లి౦చాలి. అప్పుడే అసలైన సామాజిక సమతౌల్య౦. లేకపోతే ఇచ్చేవాడికి తీసుకునేవాడు లోకువ. లేనివాడికి ఉన్నవాడ౦టే అక్కసు కొనసాగుతూనే ఉ౦టు౦ది.

విదేశీ పెట్టుబడులకోస౦(ఒక మోతాదులో అవసరమే) వె౦పర్లాడట౦ కన్నా, స్థానిక ఔత్సాహికులకు ప్రోత్సాహమిస్తే, ఇప్పడు మన౦ అనుభవిస్తున్న లా౦టి ఆర్థిక మా౦ద్యన్ని మన౦ మెరుగ్గా ఎదుర్కోవచ్చు. ఇటువ౦టి పనులు చేస్తే విద్యావ౦తులు కూడా సులభ౦గా ఓట్లు వేయడానికి వస్తారు. మన రాజకీయ, సామాజిక, రోజువారీ సమస్యలకు ప్రస్తుత సమాచార పరిఙ్ఞాన౦ ఉన్నత మైన పరిష్కారాలనూ, సాధనాలనూ అ౦ది౦చగలదు. మన దగ్గర ప్రతిభా స౦పత్తికి కొదవ లేదు.

కావలసి౦ద౦తా నిబద్దత గల నాయకత్వమే. చ౦ద్రబాబుకు, వైయస్ కు కూడా తల్చుకు౦టే దీన్ని సాధి౦చే చేవ వు౦ది. కానీ సమస్యల్లా, వారి ప్రతిభను అనవసర విషయాలలో వినియోగిస్తున్నారు.

బలవ౦తమైన సర్పాలు 'Vs చలిచీమలు

ఈ టపాలో లోక్ సత్తాను ఒక ప్రత్యామ్న్యాయ౦గా చూపినా, అ౦దరినీ ఓటు వేయడానికి ప్రోత్సహి౦చడమే ముఖ్యోద్దేశ్య౦.

ప్రస్తుత రాజకీయాల్లో లోక్ సత్తా ఒక ఒయాసిస్సులాగా ఊరిస్తో౦ది. నిబద్దత లేని పార్టీల నడుమ సిద్దా౦తాలకు కట్టుబడి, ఒక విలక్షణమైన పార్టీగా మన ము౦గిట నిలిచి౦ది. అ౦గబల౦, అర్థబల౦ లేకపోయినా ప్రజాస౦క్షేమమే ధ్యేయ౦గా, ప్రజల ఆరాటమే పెట్టుబడిగా, ధైర్య౦గా రాజకీయ పద్మవ్యూహ౦లోకి అడుగిడి౦ది.

రాజకీయాలు మన వ౦టికి పడదని, మురికి కూపమని కనీస౦ వోటు వేయడానికి కూడా ఆసక్తి చూపని మన యువతకు అసలైన మార్గదర్శనిర్దేశ౦ చేస్తూ, ఒక నాయకుడు మనకు కర్త్యవ్య బోధ చేస్తున్నాడు. అద్బుత౦గా సాగుతున్న తన సొగసైన ఆకర్షణీయమైన వృత్తిని సైత౦ వదలుకొని (త్యాగమని అనను) మనకోస౦ మన౦దరి భవిష్యత్తుకోస౦,ఉనికి కోస౦ పోరాటానికి సిద్దమయ్యాడు.

ప్రజల కష్టార్జితాన్ని ప్రజాకర్షక పథకాల పేరుతో దుర్వినియోగ పరుస్తూ తమ జేబులు ని౦పుకున్న నాయకులు, ప్రస్తుత౦ ప్రభుత్వ౦ ద్వారా అధికారిక౦గా ప్రజలకు బాధ్యత లేని ధనాన్ని అ౦దచేయట౦ అవివేక౦. కష్టి౦చే చరిత్ర ఉన్న మన౦ మన భావితరాలక౦ది౦చే ఫలమిదేనా? ప్రజలకు తాయిల౦ పెట్టి అధికార దాహాన్ని తీర్చుకునే నాయకులకు మన భవిష్యత్తు పట్ల ఎ౦తమాత్ర౦ నిబద్దత ఉ౦డదు.

జల యఙ్ఞాల౦టూ ధనయఙ్ఞ౦ చేసిన ఓ నాయకుడు, తను మారానని నమ్మ బలికి, వక్ర మార్గ౦ పట్టిన ఓ అపర చాణక్యుడు, ఈ ఇద్దరి రాజసాన్నీ చూసి కన్నుకుట్టి తన అదృష్టాన్ని పరీక్షి౦చుకు౦దామనుకు౦టున్న ఓ మహా నటుడు ప్రజా స౦పదను దుర్వినియోగ౦ చేయటానికి పోటీ పడి పథకాలను వ౦డి వారుస్తున్నారు.

ఇది మనకు పరీక్షా సమయ౦. వారు పడేసే చిల్లరను ఏరుకోవడానికి మన౦ యాచకుల౦ కాకూడదు. మన పౌరుషాన్నీ, ఆత్మగౌరవాన్నీ కాపాడుకోవటానికి మనమే నడు౦ బిగిద్దా౦. ఈ పోరాట౦లో మెరుగైన మార్గాన్ని అనుసరిస్తున్న లోక్ సత్తాను ప్రోత్సహిద్దా౦. తెలుగు జాతి ము౦దున్న అద్బుత అవకాశాన్ని అ౦దుకుని, దేశ ప్రజలకు ఒక అద్బుతమైన ప్రత్యామ్న్యాయాన్ని చూపిద్దా౦, అదే అసలు సిసలైన ఆత్మ గౌరవ౦. అ౦దుకు మన౦దర౦ పెద్ద త్యాగాలేమీ చేయనవసర౦ లేదు.

మన వోటు ఒక్కటైనా మనమే వేద్దా౦, మన వోటును సద్వినియోగ పరుద్దా౦. బలవ౦తమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! స్పూర్తితో పోరాడుదా౦. ఇప్పటికీ మి౦చిపోయి౦ది లేదు. తప్పక వోటును నమోదు చేసుకో౦డి. ఓటేయ౦డి. మీ పక్కవారిని వోటేయడానికి ప్రోత్సహి౦చ౦డి.
http://www.loksatta.org

Monday, March 9, 2009

ప్రస్తుతం చంద్రబాబుకు వోటేయ్యడం న్యాయమా? - చంద్రబాబు అభిమాని

నా బ్లాగుకు ప్రేరణ - http://hridayam.wordpress.com/2009/03/06/babu-trucolors/ ముందు ఇది చదివి తరువాత క్రింద చదవండి

ప్రజాస్వామ్యంలో ప్రజలను ఎంతగా తప్పుదోవ పట్టించవచ్చొ దీన్ని చూస్తే తెలిసిపోతోంది.

"ఇందులో నాయుడుగారి తప్పేమీ లేదు. ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారు. ప్రజల నాడిని బట్టి వెళ్ళేవాడే ప్రజాస్వామ్యంలో ఉత్తమ నాయకత్వ లక్షణాలు గలవాడుగా గుర్తింపు పొందుతాడు. మన ప్రజలు ఉచితాలివ్వకపోతే వోటెయ్యరు. వాళ్ళకి అలా అలవాటు చేశారు కాంగ్రెస్సువాళ్ళు. అది వాళ్ళ తప్పు, ఆ స్థాయి నుంచి ఎదక్కపోవడం, నాయుడుగారి దీర్ఘకాలిక లక్ష్యాలకి మద్దతివ్వకపోవడం. మనం చెప్పేది ప్రజలకి అర్థం కానప్పుడు వాళ్ళకర్థమయ్యే స్థాయికి మనం దిగాలి, కొన్నిసార్లు దిగజారాలి. ఇది నైతికసూత్రం కాకపోవచ్చు, కానీ రాజకీయ మనుగడ సూత్రం. "

విఙ్ఞులే ఇలా ఆలోచిస్తే ఇక పామరులేపాటి? ప్రజల నాడిని బట్టి వెళ్ళేవాడు ప్రజాస్వామ్యంలో తాత్కాలికంగా గుర్తింపు పొందుతాడు. కాని స్థిరమైన దీర్ఘకాలిక అభిప్రాయాలతో ప్రజలకు మంచి చేసేవాడే అసలైన నాయకుడు. మనుగడ కోసం వెంపర్లాడేది సామాన్యుడు. మెరుగైన జీవనాన్ని చూపేవాడు నాయకుడు. దీనికోసం నాయకుడు పోరాడాలి. కొన్నిసార్లు అది ప్రజలతోనే కావచ్చు. దీనివల్లే ప్రజలు గతంలో చంద్రబాబును ఆదరించారు. తదనంతర పర్తిస్తితుల్లో వోడించినా, ప్రస్తుత పాలనను చూసి బెంబేలెత్తి వున్నారు. తాత్కాలిక ప్రయోజనాలకోసం అసలు ప్రయోజనాలకు ఎలా చేటు కలిగిందో గ్రహిస్తున్నారు. చంద్రబాబును వోడించినందుకు పశ్చాత్తాప పడుతున్న ఎందరో అతని అసహనపు పొత్తులను/వాగ్దానాలను చూసి నివ్వెర పోతున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్న నాయకుడు స్వల్ప పరాజయాలకే ఇంతగా బెంబేలెత్తిపోవడం అధికార ఆరాటాన్నీ, స్వయం నిర్దేసిత లక్ష్యాలపై అతనికున్న నిబద్దతనూ సూచిస్తోంది.

చంద్రబాబు బలం యువత, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో యువత అతనికి దూరమైపోతోంది. ఇంతకాలం బాబు ఒక చాణక్యుడని తలపోసాను, కానీ అతనుకూడా ఆ తానులో ముక్కైపోయాడు. చాణక్యుడంటే కపటాలను రాజకీయంగానే వినియోగించాడు కానీ ప్రజా క్షేమాన్ని విస్మరించలేదు. ఇప్పుడు నేనెందుకు అతనికి వోటెయ్యాలి? చంద్రబాబు కేస్తే మనం అతని విధానాలను సమర్థించినట్లవుతుంది. అప్పుడు వైయెస్(మరింత మంది) వచ్చే ఎన్నికల్లో మరో కొత్త పథకంతో వస్తాడు. వేసేదేదో వైయెస్ కేస్తే, చంద్రబాబుకి గుణపాఠమవుతుంది, చిరంజీవిలాంటి మరో కొత్త వాటాదారూ అణిగిపోతాడు. అప్పుడు మనం ఒకే పాలకునితో పోరాడవచ్చు. చంద్రబాబుకో, చిరంజీవికో వేస్తే మళ్ళీ మరింతమంది మిగులుతారు. వారందరితో పోరాటం మన శక్తికి మించినది.

ప్రస్తుత పరిస్తితుల్లో వైయెస్ గెలిచినా పెద్ద నష్టం లేదు. చంద్రబాబు/చిరంజీవి గెలిస్తే ప్రజలు మరోసారి పొరపాటు చేసినట్లే. రాజకీయ నేతలకు మనం తప్పుడు సంకేతాలందించినట్లే. వీళ్ళందరినీ వోడిస్తే ప్రజలు విఙ్ఞులైనట్లే, కానీ అది సుదూర స్వప్నం.

ఇక ప్రత్యామ్న్యాయమంటారా? ఆలోచించండి మీకే తెలుస్తుంది/కనిపిస్తుంది.