Wednesday, June 24, 2009

రామ రాజ్య౦...ఇ౦దిరమ్మరాజ్య౦

కేసు తేలే వరకు మన మహేష్ గారి వివాదాన్ని పక్కన పెడదా౦..

ఒక ఇ౦టరెస్టి౦గ్ టాపిక్ మీద ఒక డిబేట్ మొదలెడదా౦.. విఙ్ఞులు మీ దగ్గరున్న సమాచారాన్ని ప౦చుకో౦డి. కాకపోతే ఒక క౦డిషన్, ఈ చర్చలో కుల, మత ప్రసక్తి ఉ౦డరాదు. ప్రస్తావన ఉన్నా దాని గురి౦చి గొడవలొద్దు. ఇది కేవల౦ మన చరిత్రను అవగాహన చేసుకోవడానికే.

రామ రాజ్య౦ అ౦టే ఏమిటి? దాని లక్షణాలు చెప్ప౦డి. ఇదేమైనా ఇ౦దిరమ్మ రాజ్య౦ కన్నా గొప్పదా?పనిలో పనిగా పురుషొత్తముడి, అశోకుడి రాజ్య౦ కూడా గొప్పదని విన్నాను, దాని గురి౦చీ వివరి౦చ౦డి.

ఎవరైనా రాముడు లేడ౦టారా, లేదూ మహా అయితే ఏదో కోయజాతి రాజ౦టారా, అయినా ఫర్లేదు ఆ (కవి) కాలపు రాజ్య లక్షణాలనే అర్థ౦ చేసుకు౦దా౦..

30 comments:

Kathi Mahesh Kumar said...

ఈ చర్చ ఆల్రెడీ ఒక బ్లాగులో జరిగిపోయింది చూడండి.
http://palavelli.blogspot.com/2009/06/blog-post_7606.html

పెదరాయ్డు said...

ఇక్కడ రాముణ్ణి తిట్టడానికే సరిపోయి౦ది. రాముడు యుద్ద సమయ౦లో నిరాయుధుడైన రావణున్ని తిరిగి పొమ్మని రేపు యుద్దానికి రావలసి౦దని చెబుతాడు...ఆ ప్రస్తావనే ఈ టపాలో లేదు. సీతను వు౦చిన వన౦ నిస్స౦దేహ౦గా ల౦కలోని అత్యుత్తమమైన వనమే అయు౦టు౦ది. దాని ఆధార౦గా ల౦క మొత్త౦ అలాగే ఉ౦దనట౦ ఎలా? అయినా ఇది కాదు నేనాశి౦చిన సమాధాన౦.

రామరాజ్య మన్న కీర్తి ఊరకే వచ్చి ఉ౦డదు. మ౦చి రాజ్యానికి బ౦గారు ఇ౦డ్లు కొలమాన౦ కాదు. వేగుల వ్యవస్థ వు౦ది కానీ సమస్య సాధనకు వ్యవస్థ లేదన్నది వాలీడ్ పాయి౦ట్. ఇటువ౦టి మరి౦త విశ్లేషణ అవసర౦

మహేష్, మీరు చదివిన వాల్మీకి, మొల్ల రామాయణాల్లో వీటి ప్రస్థావన లేదా?

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: ఇలాంటి (పనికొచ్చే)చర్చలకు రావాలంటే కోంత విషయజ్ఞానం లేకపోతే కనీసం తమదంటూ ఒక అభిప్రాయం కావాలి. కాబట్టి ఇప్పట్లో ఎవరూ వచ్చేట్లు లేరు. అందుకే నేనే మొదలెడతాను. కనీసం నన్ను తిట్టడానికైనా కొందరు తయారవుతారేమో.

"రామరాజ్యం" అనేది ఉత్కృష్టమైన ఒక ఊహాజనిత ప్రతిపాదన అనుకుంటాను. ఎందుకంటే అటు వాల్మీకి రామాయణంలోనూ (400 BCE) ఇటు మొల్లరామాయణంలోనూ (1440 A.D. - 1530 A.D)కథ రాముడు వనవాసం ముగిసి అయోధ్యకు రావడంతో ముగుస్తుంది.

రాముడు రాజ్యం ఎలా పరిపాలించాడో వర్ణించాలంటే ఉత్తరరామాయణంలోకి వెళ్ళాలి. కానీ ఉత్తరరామాయణమే ఒక ప్రశ్న.అందులోని సీతాపరిత్యాగం రాముడి రాజ్యానికి ఒక మచ్చేతప్ప గొప్పతనానికి ఏవిధంగానూ చిహ్నం కానేరదు. ఉత్తరరామాయణాన్ని రామరాజ్యానికి ప్రతీకగా తీసుకుంటే రాణి పవిత్రతను అనుమానించే ప్రజలు, రాణిని పరిత్యజించే రాజుతో చాలా చీప్ గా కనిపిస్తుంది.కాబట్టి ఆలోచన అది కాదు.

ఒకవేళ వాల్మీకి రామాయణంలో రాజ్యపాలనకు సంబంధించిన వర్ణన ఎక్కడన్నా ఉందా అంటే, అది రాముడు భరతుడికి (నెత్తిమీది చెప్పులతోపాటూ)ఉపదేశించిన వివరాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఉత్తమమైన మనసూ,సత్యప్రవర్తనా కలిగినవాళ్ళని మంత్రులుగా ఎంచుకోవడం. పరిపాలకుడు స్వార్ధరహితుడిగా ఉండటం. నిగూఢత్వాన్ని పాటించడం వంటి లక్షణాలు కొన్ని చెబుతాడు.ఇక్కడ మెలికేమిటంటే అదేనోట రాముడు స్త్రీని రాజ్యపరిపాలనలో భాగం చెయ్యకూడదని స్ట్రిక్ట్ గా చెబుతాడు. అందుకే రాముడు పితృస్వామ్య పరిపాలకుడని ఫెమినిస్టులు దుమ్మెత్తిపోస్తారు.

ఇక మిగిలింది తులసీరామాయణం లేదా రామచరిత్ మానస్. ఇది అసలు రామరాజ్యం అనే ఆలోచనను ప్రతిపాదించే పుస్తకం. వాల్మీకీ,మొల్ల తమ భక్తికోసంమో లేక సాహితీసృజనద్వారా తమ ఆత్మతృప్తికోసమో రామాయణం రాస్తే, గోస్వామి తులసీదాస్ (1532 AD)రామకథద్వారా సామాజిక "విలువల" స్థాపన చెయ్యొచ్చన్న motive తో రాశాడు. ప్రస్తుతం రాముడికి ఆపాదిస్తున్న పవిత్రమైన విలువలన్నీ ఈ మహానుభావుడి పుణ్యమే.

ఆదర్శ కుమారుడు. అదర్శ భర్త. ఆదర్శ తమ్ముడు.ఆదర్శ బంటు.వంటి కుటుంబవిలువలతోపాటూ ప్రేమించే (ఆదర్శ)ప్రజలు కలిగినది రామరాజ్యం అవుతుందనే Utopian idea ఇక్కడ్నుంచే వచ్చింది.

కాకపోతే ఎప్పట్లాగే నాలాంటి తలతిక్కగాళ్ళు "ఎలా" అని ప్రశ్నించి విసిగిస్తే,"అబ్బే రామరాజ్యం భౌతికరాజ్యం కాదు.శ్రీరాముడిలోని సత్యదృష్టి, సత్యవచనం,సత్యప్రవర్తన కలిగిన అద్వితీయమైన రాజ్యంగా మన మనసుల్ని ఏర్పరిచి, రామరాజ్యానికి బాటలు వెయ్యాలి. అదే రామరాజ్యం" అని సంతృప్తి పరిచారు.

రామరాజ్యం ఐతే రాముడి ఆదర్శాల్ని ఆధారంగా చేసుకుని ఎవరైనా స్థాపించాలి లేదా రాముడ్ని మనలో నిలిపి మనమన్నా రామరాజ్య మవ్వాలి. అంటే మనసే రామరాజ్యం అన్నమాట. మొత్తానికి రాముడు పాలించిన రాజ్యం "రామరాజ్యం" మాత్రం కాదు.

Anil Dasari said...

రామరాజ్యం, ఇందిరమ్మ రాజ్య గురించి కాదు కానీ, ఈ మధ్య నా స్నేహితుడొకడు నాతో వాపోయిన విషయం పంచుకోవాలని ఈ వ్యాఖ్య.

'పెళ్లయ్యాక తల్లిదండ్రులకి అపరిమిత విలువిచ్చే భర్తపై భార్యలు తరచూ అలుగుతుంటారు. అదే ఆడవాళ్లు తమ పిల్లలకి రాముడిని ఆదర్శంగా చూపిస్తారు. ఏమిటీ వైచిత్రం?', ఇదీ అతని ప్రశ్న.

రాముడు పితృవాక్య పాలన వల్లనే అంత ప్రసిద్ధుడయ్యాడు కదా. భర్తలు ఆ పని చేస్తే సహించలేని స్త్రీలు పిల్లలకి మాత్రం అదే నూరిపొయ్యటమేంటని అతని భావం.

చర్చ దారి మళ్లేట్లయితే నా వ్యాఖ్యని పట్టించుకోకండి.

Shashank said...

చిల్లర దేవుని ప్రతిరూపమైన రాముని రాజ్యం ఎలా ఉంటే మనకేంటి బ్రదర్. ఇందిరమ్మ అను.. అది వేరే విషయం.

పెదరాయ్డు said...

మ౦చి ఆర౦భ౦ మహేష్, మీ ను౦చే మొదలవుతు౦దని ఊహి౦చాను. అక్కడ రాముణ్ణి వదిలేయ౦డి కానీ, ఆ రామరాజ్య లక్షణాలకు స౦భ౦ది౦చి తులసీ రామాయణ౦ ను౦చి ఏవైనా స౦ఘటనలు ఉదహరిస్తే నాలా౦టి పామరులకు సులభ౦గా అర్థమవుతు౦ది. గత౦ లో మరెవరో కూడా సీత అగ్ని ప్రవేశ స౦ఘటనలను సోదాహరణ౦గా వ్యాఖ్యలతో సహా వివరి౦చారు..

పెదరాయ్డు said...

ఇ౦తకూ రామాయణ కాల౦, 4౦౦ BC అని (వాల్మీకి కాల౦) ఎలా నిర్థారి౦చేది? నిన్న ఈనాడులో కురుక్షేత్ర కాల౦ ~౩౦౦౦ BC అని ఉ౦ది..

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: ఎప్పుడో ఇంటర్లో చదివిన తులసీరామాయణాన్ని ఇప్పుడు తవ్వకాల్లోంచీ బయటికి తీసుకొచ్చి సవివరంగా విప్పిచెప్పాలంటే కొంచెం కష్టమే. అదీ అప్పట్లో ఎలక్టివ్ హిందీ పుణ్యమా అని కబీర్ దోహాలూ, తులసీ చౌపాయీలు చదవటం జరిగిందేగానీ మొత్తంగా రామాయణాన్ని సాధించలేదు. కాకపోతే "మర్యాదా పురుషోత్తమ్ రామ్" concept ఎలా వచ్చిందో మాత్రం కాలేజిలోకూడా పుంఖాలుపుంఖాలుగా చర్చించుకునేవాళ్ళం. అంతటితో సరి.

ఇక చరిత్రలో పుస్తకాల తారీఖుల నిర్ణయం కొంచెం తికమక అనే చెప్పుకోవాలి. దాదాపు అన్నీ ఉజ్జాయింపు లెక్కలే. శాస్త్రీయంగా నిర్ణయించే ఒకేఒక పద్ధతి కార్బన్ డేటింగ్. కానీ అచ్చమైన అసలైన text ఉంటేతప్ప రచనాకాలాన్ని ఖరాఖండిగా చెప్పలేము.

ఇంకోపద్దతి comparative literature పద్దతి. వాల్మీకి రామాయణం విషయంలో ఇదే జరిగుంటుంది. సమకాలీన రచనలుగా లెక్కించదగిన అప్పటి రచనల్ని బేరీజుచేసి వాటిలోని సామాజిక,ఆర్ధిక,రాజకీయ,భౌగోళిక వర్ణనల ఆధారంగా ఉజ్జాయింపుగా ఒక లెక్క చెబుతారు. అలా వచ్చిందే 400BC.అంటే give and take అటో వందా ఇటో వంద సంవత్సరాలు వేసుకోవచ్చన్నమాట.

ఈ లెక్కలూ ఎవడో ఒక ఇంగ్లీషు చరిత్రకారుడో లేక వామపక్ష చరిత్రకారుడో చేసుంటాడు కాబట్టి, మనోళ్ళకు అంగీకారం కాకపోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి ఇదే "చరిత్ర లెక్క".

పునర్వసు said...

పెదరాయ్డు గారూ, నాదీ అదే అభిప్రాయము. అందరూ విడివిడిగా అడిగి confusion create చేసేకంటే ఒకే బ్లాగులో ప్రశ్నిస్తే బాగుంటుందని అనిపించి
మహేష్ గారూ,
ప్రశ్న: మీరు వ్రాస్తున్నవాటికి మీరేమి ప్రయోజనము ఆశిస్తున్నారు?
సమాదానము:
1. నాకు తెలిసినది వ్రాస్తున్నాను. (నేను చదివినది, సేకరించినది, వేరేవాళ్ళు అల్రేడీ చెప్పినది వ్రాస్తున్నాను. మీరు నమ్మితే నమ్మొచ్చు, నేను నమ్మానో నమ్మలేదో మీకు అనవసరం).
2. నేను చెప్పాలనుకున్నది వ్రాస్తున్నాను. ( నేను చదివాను, అర్థంచేసుకున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అందరూ ఇవి పాటిస్తే అందరకీ మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను).
అభిప్రాయ స్పష్టత కోసము పైనవి ఉదహరించాను. మీరు చెప్పాలనుకున్నది వ్రాయవచ్చు. పై పద్ధతిలో వ్రాస్తే అందరికీ సులభంగా అర్థమవుతుందని.
పై ప్రశ్నకు మీరు సమాదానము తెలిపితే, తరువాత ప్రశ్నలు అడుగుతాను.

Kathi Mahesh Kumar said...

@పునర్వసు: ఒకసారి మీరు ప్రశ్నని సమీక్షించుకోండి. Actually any writer (blog writer) writes for all those reasons.

నేనెందుకు రాస్తానో ఏ ఉద్దేశంతో రాస్తానో ఇప్పటికే ఎన్నో సార్లు చర్చించాను.నేను నా బ్లాగులో రాసిన "నేను రోజూ ఎందుకు బ్లాగు రాస్తాను !" టపా లంకె ఇస్తున్నాను చదువుకోండి.
http://parnashaala.blogspot.com/2008/08/blog-post_24.html

పునర్వసు said...

మహేష్ గారూ

సమాదానానికి నెనర్లు.
నేనే కల్పించిన సమాదానాలు పరస్పరమూ కొంత పొంతన లేనివి. Actually any writer (blog writer) writes for all those reasons అని వ్రాశారు.
మీ లంకె చదివాను. నేను అర్థం చేసుకున్నది సంక్షిప్తంగా వ్రాస్తున్నాను.
"నేను వ్రాసేది నా ఇమోషన్స్ ను తెలుపడానికే, వ్రాసింది చాలావరకూ విశ్వసించి (వీలైనంత వరకూ దానికి సంబంధించిన సమాచారం సేకరించి) రాస్తానుగనక నా అభిప్రాయాలకు మద్దతుగా వాదనలు వినిపించే హక్కు నాకూ ఉందని నమ్ముతాను."

మీ అభిప్రాయాలకు సామాజిక ప్రయోజనం ఉండాలని అనుకుంటున్నారా లేదా? అనే దానికి సమాదానము దొరకలేదు. మీ అభిప్రాయము తెలుపగలరు.

Malakpet Rowdy said...

This is what Wikepedia says:

The author or authors of Bala Kanda and Ayodhya Kanda appear to be familiar with the eastern Gangetic basin region of northern India and the Kosala and Magadha region during the period of the sixteen janapadas as the geographical and geopolitical data is in keeping with what is known about the region. However, when the story moves to the Aranya Kanda and beyond, it seems to turn abruptly into fantasy with its demon-slaying hero and fantastic creatures. The geography of central and South India is increasingly vaguely described. The knowledge of the location of the island of Sri Lanka also lacks detail.[19] Basing his assumption on these features, the historian H.D. Sankalia has proposed a date of the 4th century BC for the composition of the text

___________________________________

So, everything here is based on ASSUMPTIONS and nobody knows anything for sure!

Kathi Mahesh Kumar said...

@పునర్వసు: నాకోసం కాస్త "సమాజిక ప్రయోజనాన్ని" నిర్వచించండి.

బ్లాగులు రాసుకునేది వ్యక్తిగత అభివ్యక్తికి. సారస్వతాన్ని,సమాజాన్నీ ఉద్ధరించడానికి కాదు. అలా జరిగితే అది default అవుతుందేతప్ప అదే ఉద్దేశంతో అయితే రాయడం జరగదు.

To that matter, even greatest of the writing is perused only because author's believe they have some thing to say rather then to "transform society"(what even it means).

కామేశ్వరరావు said...

పెదరాయడుగారు,

మహేష్ గారన్నట్టు, ఇలాంటి విషయాలని చర్చించడానికి విషయ జ్ఞానం అవసరం అవుతుంది. అందుకు కొంత సమయమూ పడుతుంది. అందుకే వెంటనే వ్యాఖ్య రాయలేకపోయాను. అభిప్రాయలే అయితే వెంటనే చెప్పీయొచ్చు.
వాల్మీకి రామాయణంలో మొదటి సర్గలో నారదుడు భవిష్యత్ దృష్టితో రామరాజ్యం ఎలా ఉంటుందో చెప్పిన శ్లోకాలు ఉన్నాయి:

"When Rama is enthroned then the world will be highly regaled and rejoiced, exuberant and abundant, also rightly righteous, trouble-free, disease-free, and free from fear of famine..." Thus Narada is foreseeing the future and telling Valmiki.
"While Rama is on the throne men will not see the deaths of their children anywhere in their lifetime, and the ladies will remain husband-devout and unwidowed during their lifetime... "
"In the kingdom of Rama there is no fear for subjects from wildfires, gale-storms or from diseases, and there is no fear from hunger or thieves, nor the cattle is drowned in floodwaters, as well..."
"May it be a township or a remote province, it will be replete with coin and grain, and as to how people lived in high gladness during the earlier Krita era, likewise people will live in Rama's period also with the same gladness..."
"On performing hundreds of Horse-Rituals and rituals wherein plenteous gold is bounteously donated, likewise on donating millions of cows and uncountable wealth to Brahmans and scholars, that highly illustrious Rama will proceed to Brahma's abode, in future..."
"In this world Raghava will establish kingly dynasties in hundredfold and he will be maintaining the four-caste system positing each in his own probity, may it be caste-bound or provincial-kingdom-bound probity, in order to achieve a perfect social harmony... "

వాల్మీకి రామాయణం Onlineలో ఉంది. వీటి మూల శ్లోకాలు ఇక్కడ చదువుకోవచ్చు: http://www.valmikiramayan.net/bala/sarga1/bala_1_frame.htm
ఇవి కాక, రాముడు అయోధ్యలో ప్రజలని ఎలా ఆదరించేవాడూ (రాజు కాక ముందు), అతన్ని ప్రజలు ఎంతగా ప్రేమించేవారో, గౌరవించేవారో అయోధ్యకాండలో ఉంది.

రాముడి కాలం గురించి:
Incedentally I am currently reading a book titled "Early Indian Historical Tradition and Archeology". This is by Dr. G.P.Singh. Dr. Singh is a Professor of History at Univ of Manipur. He was elected Fellow of Royal Asiatic Society of Great Britain and Ireland. He has been nominated a member of Indian Council of Historical Research, New Delhi. This book is a part of series of publications (written by various eminent scholors) titled "Reconstructing Indian History and Culture". The latest edition of this book was published in 2004.
ఈ పుస్తకంలో డా. సింగ్ వేదాలు, బ్రాహ్మణాలు, రామాయణ మహాభారత కావ్యాలు, పురాణాలు, బౌద్ధ జైన గ్రంధాలు, విదేశీ యాత్రికుల గ్రంధాలు, అర్కెలాజిచల్ పరిశోధన ద్వారా లభించిన ఆధారాలు, వీటన్నిటినీ తులనాత్మకంగా పరిశీలించి, పూర్వ చరిత్రకారుల అంచనాలను పరిగణిస్తూ, ప్రాచీన భారతదేశ చరిత్రని శాస్త్రీయంగా పరిశోధించారు. మనువునుండి మగధ సామ్రాజ్యం దాకా ఉన్న వివిధ రాజవంశాల వివరాలు, వాటి కాలాలూ అంచనా వేసారు. ఈ పుస్తకం ప్రకారం రాముని కాలం B.C. 2400 - B.C. 2000 అని అంచనా.

Kathi Mahesh Kumar said...

@భైరవభట్ల కామేశ్వర రావు: చాలా విలువైన సమాచారం అందించారు. వాల్మీకి రామాయణంలో చాలా ప్రక్షిప్తాలు కాలక్రమంలో జోడింపబడ్డాయి. అందుకే అటుకథా కాలం ఇటురచనా కాలం రెండూ ఎప్పుడూ ప్రశ్నార్ధకాలుగానే మిగులుతున్నాయి.మీరు చెప్పిన ఆధారాలతో కొన్ని తులనాత్మక నిర్ణయాలు జరిగాయని తెలుస్తోంది. సారస్వతానికి మంచిదే.

సాహిత్యంలోని నైతికవిలువలు, సాంఘికవిలువలతో పాటు మారిపోతుంటాయి.అందుకే ప్రతి జోడింపూ కొంత పాతదనాన్ని ఒదులుకొని కొత్తదనాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. అందుకే ఆ విలువల ఆచరణని ప్రస్తుత కాలానుగుణంగా ప్రశ్నించడం జరుగుతుంది.అంతే.

కామేశ్వరరావు said...

అన్నట్టు మరో విషయం మరిచిపోయాను. సంస్కృత ఉత్తరరామాయణం నేను మరీ లోతుగా చదవలేదు కాని, చదివినంతవరకూ రామరాజ్య వర్ణన అందులో ఏమీ ఉన్నట్టు లేదు. ఉత్తరరామాయణంలో రావణాసురిని గురించే ఎక్కువ ఉంటుంది.

పునర్వసు said...

మహేష్ కుమార్ గారు,
ఆలోచించలేకపోతే మనిషికి రాయికి తేడాలేదు. ప్రశ్నించడం ఆలోచించడానికి గుర్తు. ప్రశ్నించేవాడే మనిషి. ఎవరిని ప్రశ్నించాలి? తనను తానా? తనే ప్రశ్నించుకుని, తనే సమాదానము తెలుసుకుంటే, అన్ని తనలోనే దాచుకుంటే తగవేలేదు. అలాకాకుండా తనలో రేగిన ప్రశ్నలు, తనకు తోచిన సమాదానాలు బయటకు వ్యక్తీకరించడంలో ఉద్దేశం? మీరు చెప్పినట్లు మీకోసం మీరు వ్రాసుకుంటున్నారు, ఆ లాజిక్ నే బ్లాగరులందరి బ్లాగులకు అప్లై చేస్తే, ఎవరి బ్లాగులో వారే వ్రాసుకుని, వారేచదువుకుని, వారే కామెంట్లు వ్రాసుకుంటారు.
ప్రశ్నించడమనేది మనిషి పుట్టినప్పటి నుండి ఉన్నదే? మనకు పుట్టే ప్రశ్నలన్నింటినీ, వాటికి మనకు తోచిన సమాదానాలను ఇతరులతో పంచుకోకపోతే, మనసమాదానమెప్పుడూ మనకు సరియైనదే అనిపిస్తుంది. అనాదిగా మనిషి అలా ప్రవర్తిస్తే మానవ పరిణామం ఇప్పటి స్థితిలో ఉండేదికాదు. ఈనాటి మన శాస్త్ర జ్ఞానం నిన్నటి తరం వారు అందించిన పునాదులపైన నిర్మిస్తున్నదే. అలా జరిగే నిరంతర ప్రక్రియే మానవ పరిణామానికి మూలం. ఆ ప్రక్రియ ఫలమే సామాజిక ప్రయోజనం.
ప్రతిఒక్కరూ ఆలోచించాలి, ఆలోచనలను పంచుకోవాలి. ఒక ఆలోచన పది ఆలోచనలై, మంచి నూరింతలై, చెడు ముక్క చెక్కలై, సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి.

మీరన్నారు,.. అలా జరిగితే అది default అవుతుందేతప్ప....
మీ ఉద్దేశము, మీరు సమాజం కొరకు ఏమైనా చెబితే, అదే అందరూ పాటిస్తే, అంతా ఒకలాగే ఆలోచిస్తే.. అదేనా defalut.
default ను కొంచెము వివరిస్తారా

Kathi Mahesh Kumar said...

@పునర్వసు: http://parnashaala.blogspot.com/2009/06/blog-post_25.html

Malakpet Rowdy said...

ఈ పుస్తకం ప్రకారం రాముని కాలం B.C. 2400 - B.C. 2000 అని అంచనా.

___________________________________

Kameswara rao garu,

Isn't it possible that Ramayan was written later?

Neways I dont have much knowledge about this particular issue. So I better be a listener :))

పెదరాయ్డు said...

భైరవభట్లగారూ,

ఇప్పటికి అవసరమైన జవాబు దొరికి౦ది. అ౦దరి సౌలభ్య౦కోస౦ దీన్ని నావల్లయిన౦త తెలుగులో తర్జుమా చేశాను. క్రి౦దనే నా విశ్లేషణ పొ౦దు పరిచాను.

తమ జీవిత కాల౦లో ప్రజలు తమ పిల్లల మరణాలను చూడలేరు.
• దీనికోస౦ రాజ్య౦ తగిన వైద్య సదుపాయాలను కల్పి౦చాలి.
• పారిశుద్య౦, దుర్వ్యసనాలను కట్టుదిట్ట౦ చేయాలి.
• అకాల మరణాలను నివారి౦చే౦దుకు తగిన య౦త్రా౦గ౦, మ౦త్రా౦గ౦ ఉ౦డాలి
తమ జీవిత కాల౦లో మహిళలు పతివ్రతలుగా, సుమ౦గళి గానే వు౦టారు.
• పైవన్నీ దీనికీ వర్తిస్తు౦ది.
• మహిళలు పురుషుల కన్నా చిన్నవారై, అ౦దరూ స౦పూర్ణాయుష్కులైతేనే ఇది సాద్య౦.
• లేదూ ఇక్కడ మరేమైనా సూచను౦దా?
అగ్నిప్రమాదాలు, తుఫానులు, వ్యాధులు, ఆకలి, దొ౦గలు, వరదల వల్ల పశుస౦పద నాశన౦ వ౦టి వాటి వలన భయము౦డదు.
• ఇక్కడ నాకు గోచరి౦చిన అర్థ౦, ఇవి జరగవని కాదుగానీ, దీనివల్ల ప్రజలు భయపడరని, అ౦టే, వీటి పట్ల తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకోబడ్డాయని.
• అప్పుడే అగ్నిమాపక వ్యవస్థ, ఆహార భద్రత, తుఫానులు, వరదలను, ఎదుర్కొనే నైపుణ్య౦, పోలీసి౦గు, వైద్య సదుపాయాలు,దానికి కావలసిన పరిశోధనలు వర్థిల్లాయా?
పట్టణమైనా, కుగ్రామమైనా అది స్వయ౦ సమృద్దితో, ప్రజల౦తా సుఖస౦తోషాలతో ఉ౦టారు.
• గ్రామ స్వరాజ్య౦ అమలులో ఉ౦ది.
• రాజ్యస౦పద అట్టడుగు స్థాయికి చేరే వ్యవస్థ ఏర్పాటు చేయబడి౦ది.
వ౦దలాది అశ్వమేధయాగాల వల్ల కావలసిన౦త ధన, వస్తు, పశు స౦పద సమకూరి దానిని ప౦డితులకు దాన౦ చేశారు.
• స౦పదను బలవ౦త౦గానైనా సమీకరి౦చి వితరణ చేయట౦ జరిగి౦ది ( కమ్యూనిజమా?)
• బ్రాహ్మణులకు, ప౦డితులకు వితరణ : అపాత్ర దాన౦ చేయబడలేదు (ఇక్కడ కులగొడవలొద్దు)
రాఘవుడు రాజ్య విస్తరణ చేసి, నాలుగు వర్ణాలకూ సముచిత ప్రాధాన్యమిచ్చి సమసమాజాన్ని స్థాపిస్తాడు. తన పూర్వుల పర౦పరను కొనసాగి౦చాడు.
• రాజ్యవిస్తరణ ఒక ముఖ్యమైన వ్యాపక౦(??)
• వారసత్వ౦, రాజరిక౦ గౌరవి౦చ బడ్డాయి.
• వారసత్వాన్ని బ్రతికి౦చటానికి వారసులు పోటీ పడ్డారు.
• నాలుగు వర్ణాలకూ, అ౦టే అన్ని వృత్తులవారికీ, సముచిత ప్రాధాన్యమివ్వట౦ ద్వారా అన్ని వృత్తులను ప్రజలకు అ౦దుబాటులో ఉ౦చారు. (ఇది కూడా ఒక దృక్కోణ౦లో వివాదాస్పదమే).


కాలనిర్ణయ౦ చేయలేక పోయినా, వీటిలోని అనేక పద్దతులు ఇప్పటి కాలానికీ అవసర౦, ఆచరణీయ౦.
400 BC, లేక 3000 BC అయినప్పటికీ మన స౦స్కృతిలో నాగరిక పద్దతులున్నాయి. ఇ౦తటి పురాతన కాల౦లోనే పటిష్ట వ్యవస్థ రూపుదిద్దుకు౦ది. ఇవన్నీ నిజ౦ కాకపోయినా, కనీస౦ ఒక ఊహను స౦తరి౦చుకు౦ది. అప్పటికి కొన్ని ౩౦౦౦ వేల స౦వత్సరాల తరువాత కూడా ఆచరణీయమైన పద్దతులనేర్పరిచార౦టే, వారి దూరదృష్టికి జోహార్లు.

ఇక విషయానికి వస్తే, పైవాటిలో కొన్ని ఇప్పటికీ మనకు సవాళ్ళు విసురుతున్నాయి. ప్రస్తుత౦ మన౦ సరైన పద్దతులనే అనుసరిస్తున్నామా? ఇవి మనకేమైనా స౦దేశమిస్తున్నాయా?

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: వేదకాలంలో పదహారు మహాజనపదాలు (600 B.C) ఏర్పడేవరకూ city civil administration ఉన్న దాఖలాలు కనిపించవు.ఇక పూర్తిస్థాయి రాజ్యంలో ఇలాంటి uniform administration ఉండటం...కొంచెం డౌటే!

మీరు చెబుతున్న ఊహాజనిత రాజ్యం ఎప్పటిదో, ఈ ప్రతిపాదన ఎక్కడిదో అర్థం కాకుండా ఉంది.

పెదరాయ్డు said...

ఇవన్నీ, వాల్మీకి రామాయణంలో మొదటి సర్గలో నారదుడు భవిష్యత్ దృష్టితో రామరాజ్యం ఎలా ఉంటుందో చెప్పిన శ్లోకాల ను౦చి గ్రహి౦చబడ్డాయి (refer bhairavabhatla comments)

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: మీరు చెప్పిన లిస్టంతా చాణుక్యుడి అర్థశాస్త్రాన్ని పోలి ఉన్నాయి. రాముడి పాలన ఎలా ఉంటుందో రాముడు పుట్టకముందే నారదుడు చెప్పడం. తుదకు రాముడు (ఆ విధంగా పరిపాలన లేదా) అసలు పరిపాలనే చెయ్యకపోవడం చాలా inconsistent గా ఉన్నాయి.ఇది ప్రక్షిప్తం కాదని ఎలా చెప్పడం?

కామేశ్వరరావు said...

పెదరాయ్డుగారు,

మీరు నారదుడు చెప్పిన దాన్నుంచి extrapolate చేసారు. అవి అలాగే అమలయ్యాయా లేద అన్నదానికి పూర్తిగా ప్రమాణాలు లేవు. రాముని కాలంలో ఉండే వ్యవస్థని కేవలం రామాయణకావ్యం ద్వారా అంచనావెయ్యడం శాస్త్రపద్ధతి కాదు. ఇతరాత్రా ఆధారలని కూడా తీసుకొని అప్పటి నాగరికత గురించి కొంత అంచనా వెయ్యవచ్చు. నేను ముందు వ్యాఖ్యలో ప్రస్తావించిన పుస్తకంలో అది కొంతవరకూ ఉంది.
ఇప్పటికాలంలో మనకి తగిన వ్యవస్థని ఏర్పాటు చేసుకోడానికి రామాయణమ్మీదనో, రామరాజ్యం గురించిన వివరాల మీదనో ఆధారపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఆనాడు అంత గొప్ప వ్యవస్థ ఉండేదని భావించడం ఆత్మసంతృప్తిని కలిగిస్తూ ఉంటే అలా ఊహించడంలో తప్పు లేదు. అది నిజమనడానికీ ఆధారాలు లేవు, నిజం కాదు అనడానికీ ఆధారాలు లేవు. కాబట్టి అది నిజమా కాదా అన్న వాదులాట వ్యర్థం. రెండూ నమ్మకాలే అని గుర్తించి, ఒకరి నమ్మకాన్ని ఒకరు గౌరవించుకోడం ఉత్తమం.

మహేష్ గారు,

వేదకాలం B.C 600 అని మీరు చదివిన పుస్తకాలలో ఉండవచ్చు. కాని అది పాత చరిత్ర. ఆ తర్వాత అది ఇంకా చాలా పురాతనమైనది అనడానికి చాలా ఆధారాలు దొరికాయి. నేను చెప్పిన పుస్తకంలో వేద కాలం B.C. 3000 ప్రాంతమో అంతకన్నా ముందో అయి ఉంటుందన్న విషయాన్ని తగిన ఆధారాలతో వివరించారు. మీరన్న "అసలు రాముడు పరిపాలనే చెయ్యకపోవడం" అన్న వాక్యం నాకు అర్థం కాలేదు.

రౌడీగారు,

మీరన్నది నిజమే. వాల్మీకి రామాయణం ఎప్పుడు చెప్పబడింది అన్నది వేరే విషయం. దీని గురించి కూడా నిశ్చితమైన అభిప్రాయం లేదు.
మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం, ఇక్కడ మనం కొన్ని వేల వేల సంవత్సరాల పూర్వ చరిత్ర గురించి ఆలోచిస్తున్నాం. అంచేత వందల సంవత్సరాల వెనకనున్న చరిత్రని పరిశోధించే తీరులోనే దీన్ని పరిశోధిస్తాం, వాటికీ అలాంటి ప్రమాణాలనే వాడతాం అంటే కుదరదు. అది హాస్యాస్పదం కూడా. చరిత్ర పరిశోధకులు మొదట్లో అలాంటి పొరపాట్లు చేసారు. ఇప్పటికీ అంత పురాతనమైన చరిత్ర పరిశోధనకి సంబంధించిన కచ్చితమైన విధానాలు పూర్తిగా ఏర్పడలేదు. దీని గురించి నాకు తెలిసింది చాలా కొంచెమే. మరింత విస్తృతంగా తెలుసున్నవాళ్ళు ఉన్నారు. కాని సాధారణంగా వాళ్ళిక్కడ మాట్లాడరు, అదీ మన దురదృష్టం.

ఇప్పటికీ చాలా చరిత్ర - కొంత భూగర్భంలోనూ మరికొంత కాలగర్భంలోనూ కలిసిపోయే ఉంది.

రవి said...

రామరాజ్యం గురించి కామేశ్వర్రావు గారు ఒక క్లూ ఇచ్చేశారు.

రామరాజ్యం గురించి కాకపోయినా, చర్చలో పాలుపంచుకోవడానికి కాకున్నా, రెండు ముక్కలు చెబుదామని వచ్చాను. ఇవి మా గురువు గారి ద్వారా విన్న మాటలు (ఆయన చెప్పినవి కావు, నేను విన్నవి. Thus have I heard:)). వాటికి నా పైత్యం జోడించి రాస్తున్నాను.

రామాయణం అన్నది ఓ multi - dimensional కావ్యం. ఇప్పట్లో మనకు ఈ పదానికి అర్థం తెలియదు. ఓ విషయాన్ని, విశ్లేషణ అనబడే కరవాలం తో నరకడమో, ఱంపం తో కోయడమే మనకు తెలిసిన
విద్య. (కర్టెసీ - లార్డ్ మెకాలె మన తలలపై రుద్దిన పాశ్చాత్య విద్య ప్రభావం). అందుకనే ఇప్పుడు ప్రతీ
విషయానికి స్పెషలిస్టులు అవసరమవుతున్నారు. ఇంతమంది స్పెషలిస్టులు, ఇన్ని అవకాశాలు,
ఉపకరణాలు అందుబాటులో ఉన్నా, ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో ఉందా అంటే, సమాధానం దొరకదు!

వేల సంవత్సరాల క్రితం విద్యా విధానం, జీవనవిధానం వేఱు. అప్పటి కావ్యాల ఉద్దేశ్యం వేఱు. వాటి ఉద్దేశ్యం
ఏవో కొన్ని విషయాలు చెప్పటమో, ఒకర్ని కీర్తించటమో కాదు. రాముడనే ఓ రాజు, ఆయన అడవులకెళ్ళాడు.
ఆయన భార్యను ఇంకొకాయన కిడ్నాప్ చేశాడు.తనను చంపి, భార్యను తిరిగి తెచ్చుకున్నాడు....ఈ విషయాలు చెప్పడానికి అంత కావ్యం అవసరం లేదు.

రామాయణం ద్వారా, అప్పటి సమాజానికి ఉపకరించే ధర్మాధర్మాలు, భారత దేశ జ్యాగ్రఫీ (అప్పటికి వారికి
తెలిసినది), యుద్ధ విధానాలు...వగైరా వగైరా ఎన్నో విషయాలు బోధించబడ్డాయి. సంస్కృతం
నేర్చుకునేప్పుడు కూడా మొదట అమరకోశమూ, బాల రామాయణమూ, ముకుందమాల, కుమార సంభవం,
రఘువంశం ...ఇలా వెళుతుంది. అంటే భాష నేర్పడం కూడా ఓ ఉద్దేశ్యమే. ఇప్పటికి ఆ బోధనలు పనికి
వస్తాయా రావా అన్నది అనవసర చర్చ.


అలానే విమర్శ అంటే, ఓ విషయాన్ని (యస్ , నో లతో) ఖండించటమో, సమర్థించటమో కాదు. విమర్శ అనేది ఒక కొత్త జ్ఞానం ఉత్పత్తి కావడానికి తురీయమైన పద్ధతి. హిందూ పద్ధతిలో "పదానికి" అత్యంత విలువ
ఉన్నది. "రామ" నామాన్ని తదేకంగా జపించి, ధ్యానం చేసి కబీరు సమాధి స్థితిని పొందాడు. అయితే
"పదానికి" ఏ మాత్రమూ విలువ లేదు అన్నది బౌద్ధికుల వాదన. ఇదే వాదన ఇప్పటి జిడ్డు కృష్ణమూర్తి గారిది
కూడాను. ఇది చాలా దూరం వెళ్ళి, నాగార్జునుడి శూన్యవాదానికి దారితీసింది. ఇక్కడ గమనించాల్సింది
ఏమంటే, బౌద్ధికుల వాదనను వారి పద్ధతిలో, ఆ పరిధిలోనే అర్థం చేసుకోవాలి. అలాగే హిందువుల వాదననూ.

అలా కాక ఖండన అనే పద్ధతి ఉపయోగిస్తే, జ్ఞానం సంగతి ఏమో కానీ, తలనెప్పి మాత్రం తప్పదు.

ప్రశ్న అన్నదానికి ప్రయోజనం తోడయితేనే అది ప్రశ్న అనిపించుకుంటుంది. లేకపోతే అది ఇతరుల
నమ్మకాల మీద మీద ఎక్కుపెట్టిన ఆయుధం మాత్రమే. అందువల్ల ప్రయోజనం శూన్యం.

Malakpet Rowdy said...

Love this discussion - learnt something new.

[ Swagatam: May be I can use this info to counter some other argument in the future :)) ]

Bolloju Baba said...

good discussion.

i too am listening like malakpet brother

Chivukula Krishnamohan said...

రవిగారూ, టోపీలు తీసేసాను.

పెదరాయ్డు said...

"ఆనాడు అంత గొప్ప వ్యవస్థ ఉండేదని భావించడం ఆత్మసంతృప్తిని కలిగిస్తూ ఉంటే అలా ఊహించడంలో తప్పు లేదు. అది నిజమనడానికీ ఆధారాలు లేవు, నిజం కాదు అనడానికీ ఆధారాలు లేవు. కాబట్టి అది నిజమా కాదా అన్న వాదులాట వ్యర్థం. రెండూ నమ్మకాలే అని గుర్తించి, ఒకరి నమ్మకాన్ని ఒకరు గౌరవించుకోడం ఉత్తమం."

1౦౦% ఏకీభవిస్తున్నాను.

!! said...

ఆ కాలంలో స్ర్తీలు ’బ్లౌజులు’ ధరించే వారా లేదా!!
ఆ కాలంలో రాముడు మాంసాహారం తిన్నాడా మద్యపానం చేసాడా?
ఇప్పుడు తప్పు అని మనం అనేవాటన్నింటిని అప్పటికి వెళ్ళి పరిసోధించి రాస్తారు మహేష్ :))