Tuesday, August 26, 2008

భారత సంసృతి నీచమైనదా?

ఈ మధ్య ఎదో ఒక సాకుతో స్వీయ నిందకు పాల్పడటం ఎక్కువయిపోయింది. ఇది ఒక అభ్యుదయవాదంగా చలామణి అవుతోంది. పర సంస్కృతీ పీడలను అరువు తెచ్చుకోవటం అభ్యుదయ వాదమా? ఇతరులు దేనినైతే వద్దనుకొంటున్నారో మనం దానిని అభ్యుదయవాదం పేరుతో దిగుమతి చేసుకోవలనుకుంటున్నాం.
కాస్త ఆలోచించండి. మనలో, మన సంస్కృతిలో మంచేలేదా? ఎందుకీ పర వ్యామోహం? లోపాలులేని సంస్కృతి ఏది? వాటిని బూచిగా చూపి ఇతరుల్లోని చెడును ప్రోత్సహించటం ఎంతవరకూ సబబు. విమర్శలు అహ్వానించదగినదే వితండవాదం కాదు.
మొత్తంగా చర్చిస్తే ఒక గ్రంధమే అవసరమౌతుంది . ఒక టపాలో జరుగుతున్న చర్చను గమనించండి.
శంఖారావం లోని ఒక టపాలో జరిగిన చర్చను చూడండి. దానిలో నా సమాధానం ఇక్కడ ఇస్తున్నాను.


భారతదేశ దౌర్భాగ్యానికి అసలు కారణం అత్మపరిశీలన పేరుతో ఆత్మనింద చేస్తూ మూర్ఖంగా వాదిస్తున్నవారే. వీళ్ళు రాజకీయనాయకులకన్నా ఉత్తములు. మన సంస్కృతిని నిందించటంలో వీరికొక విజయగర్వం వుంటుంది. దీనీతోనే వీళ్ళూ గొప్పవాళ్ళమైపోయామని భావిస్తారు. మనలోని మంచికి మినహాయింపులను ఉటంకిస్తూ అదే మన సంస్కృతన్నట్లు ప్రచారం చేస్తారు. ఇతరుల దౌర్భాగ్యాపు పనుల్లో మంచిని వెదకి ఉత్తములనిపించుకుంటారు. వీరికెపుడూ దూరపు కొండలు నునుపే. పోనీ నున్నగా వున్నాయికదా అని దగ్గరికెళ్ళి పరిశీలించరు. ఇటువైపునుడే శల్యసారధ్యం చేస్తుంటారు.

"ఒకనాడు శృంగారం విషయంలో, చాలా క్యాజువల్�గా వున్న మనం, తర్వాత దాన్ని అవసరానికి మించి నిషేధించినట్ట్లు అనిపిస్తుంది. దాని విషయంలో సభ్యత కోసం కొన్ని నిధినిషేధాలు వుండవలసిందే "
-->ఇది సంపూర్ణంగా అంగీకరించాలి. మన సంస్కృతిలో శృంగారం కొన్ని హద్దులకు లోబడి క్యాజువల్గా ఉండాలని చెప్పారుకాని విచ్చలవిడితనాన్ని ప్రోత్చహించదు. నైతిక విలువనాపాదించటం ఆ క్రమంలోనిదే.

"ఒకపక్క వంద కోట్ల జనాభా కనపడుతుంటే, మరో పక్క అదేదో దొంగచాటుగా చేయవలసిన పనిగా మనం భావిస్తుంటే, దాన్ని ద్వందప్రవృత్తిగానే భావించాలి." --> ఇది ఖండించతగినది. ఇది తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్ని పనులు నలుగురిలో చేయవచ్చు. కొన్ని నాలుగు గోడల మధ్యే వుండాలి. ఆలోచించండి. ఇది ద్వందప్రవృత్తి కాదు. అసలు సిసలు పరిణితి.

"తమ తమ శరీరాల గురించి, శరీర సంబంధాల గురించి కనీస విజ్ఞానం ఎంత మంది తలిదండ్రులు వారి పిల్లలతో మాట్లాడ గల్గుతున్నారు?" --> నాకు తెలిసి ప్రతి(కనీసం మెజారిటీ) అమ్మా తనకూతురుతో ఈ విషయాలు చర్చిస్తుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో.

"."మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి" అన్నట్లుంది మీ వివరణ.కామసూత్ర మనదేశంలో పుడితే ఏం? ఖజురహో మనదేశంలో ఉంటే ఏం? ప్రస్తుతం మనదేశంలో శృంగారం "పాపం" ఇంకా చెప్పాలంటే "అపరాధం"." --> ఎవరు చెప్పారిలా? మన సంస్కృతి ఎలా వక్రీకరింపబడుతోందో చెప్పటానికి ఇది అసలైన ఉదాహరణ.ఇలా భావించి వుంటే ఈ దేశంలో పెళ్ళీళ్ళే జరుగవు. మనం అపరాధం అనేది హద్దులు మీరిన శృంగారాన్నే. వయసుకు మించిన ఆలోచనలనే. వయసెందుకు ప్రధానమంటే వయసుతోనే విచక్షణ కలుగుతుంది. మహేష్ గారూ, మీ సామెతను ఇతరవిషయాలకు కూడా విలోమంగా అన్వయించండి. చాలా సార్లు మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్నెందుకు నిందిస్తారు.

"అడ్డమైన వేషాలు వెయ్యబట్టే... ఇపుడు అడ్డమైన రోగాలు వస్తున్నాయి. మన ఋషులు, వారి సంప్రదాయాలు పాటించడం మంచిది. ఎయిడ్స్ వల్ల మన శరీరధర్మం గురించి తెలుసుకోవాలి అన్నారు. అసలు ఎందుకు వచ్చింది. ఒళ్ళు కొవ్వెక్తి చేసేపనుల వల్లేగా..." --> ఇందులో నిజం లేదా? prevention is better than cure అదే మన సంస్కృతి నేర్పుతున్నది. దానికి పెడార్థాలు తీయవద్దు.

"విచ్చలవిడితనంవల్ల AIDS రాదు. రక్షణ లేకపోతే వస్తుంది.ఇది విలువలకి సంబంధించిన విషయం కాదు.ఆరోగ్యానికి సంబంధించిన విషయం.కాబట్టి ఇక్కడ value judgement లు మాని మానవత్వాన్ని ప్రదర్శించండి.AIDS Sex ద్వారా రాదు. unprotected sex ద్వారా వస్తుంది. ఇందులో మీరు ఉద్భోధించే విలువలకన్నా, అజాగ్రత ముఖ్యకారణం." --> విలువలకు మించిన రక్షణా ఎన్నటికీ మీకు దొరకదు. రక్షణతో కూడిన విచ్చలవిడితనం AIDS నిర్మూలించబడుతుందని నమ్మితే మీరు మనిషి తత్వాన్ని తక్కువ అంచనా వేసినట్లే. unprotected sex ద్వారా మాత్రమే AIDS రాగలదనే మీ అపోహను ఏమనాలి?

" ఏ విషయంలోనైనా సత్యాన్ని దర్శించాలంటే ‘విశ్వాసం ’, ‘ఋజువు ’, ‘హేతువు ’ అనే మూడు కోణాల్లో పరిశీలించాలి. కానీ మీరు ‘హేతువు ’ అనే ఒకే ఒక్క కోణం మీదే ఆధారపడుతున్నారు. ఇలా అయితే మీరు వాదమేమో గానీ ‘వాదన ’ మాత్రం బాగా చేస్తారు." --> అఖరాలా నిజం. ఉత్త హేతువాదులంతా మూర్ఖ శిఖామణులు.

15 comments:

Anil Dasari said...

మీరన్నది నిజమే. క్రిస్టియానిటీలో original sin పేరుతో శృంగారం భయంకరమైన పాపం అన్న ముద్ర ఉంది. మరి ఎంత డివోటెడ్ క్రిస్టియన్లు ఐనా దానికి దూరంగా ఉంటున్నారా? వాళ్లది ద్వంద్వ ప్రవృత్తి అనలేం కదా.

Jagadeesh Reddy said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం. భారతీయ సంస్కృతిని అవకాశం దొరికినప్పుడల్లా విమర్శించడం ప్రతీ చోటా ఫ్యాషన్ అయిపోయింది. భారత దేశం గురించి ఏదయినా ఒక మంచి విషయంగాని, తెలియని ఒక గొప్ప విషయం గాని బ్లాగులోగానీ, పత్రికల్లోగానీ చూశారా, ఇక వీళ్ళు బయలుదేరిపోతారు. చివరికి భారతీయ సంస్కృతి అంత చెత్త సంస్కృతి ఈ లోకంలోనే లేదని వితండవాదం చేస్తారు. అలా చేయడంలోనే కొంతమందికి ఆనందం వుండొచ్చు. అమెరికాలో జరిగిన విషయమయితే ఎలాంటి రుజువులూ అక్కరలేదు. అదే ప్రాచీన భారత దేశంలో జరిగిందంటే అనుమానంగా ముఖం పెడతారు. ఎదుటివాడికి సలాంకొట్టే బానిస మనస్తత్వం పోనంత కాలం మన పరిస్తితి ఇలాగే ఉంటుంది. http://saradaa.blogspot.com/2008/07/blog-post_09.html

durgeswara said...

ఇది 200 సంవత్సరాలపాటు మెదళ్ళలోకి ఎక్కించబడ్డ బోధన. మెకాలే మానసపుత్రులకు ఆత్మ విస్వాసం కోల్పోయిన జాతి మెదళ్ళ బూజు దులపటానికి మీలాంటివారి కౄషి అభినందనీయం. కాకుంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలంటే మనకు దాగుడుమూతలు, సంకేతనామాలు అక్కరలేదనుకుంటాను. మీరు మీ అసలు పేరును తెలపండి . మీకు నా అభినందనలు.

RG said...

మన సంస్కృతి నీచమయినదనెవరూ అనలేదు... మన భారతీయ సంస్కృతిలో చెప్పేదొకటి చేసేదొకటి అనేదే మా బాధ. We are concerned about the hypocricy in our culture !!

RG said...

Spelling mistake, Its "Hypocrisy" :(

పెదరాయ్డు said...

@అబ్రకదబ్ర : నిజమే. అసలు ఉద్దేశం అవగతమైతేనే ఇవి అర్థమవుతాయి.
@ఎస్పీ జగదీష్ : మరో ట్రెండ్ వుంది. అమెరికన్లు నిర్ధారిస్తేనే మన చరిత్రకు విలువ. లేదంటే అది అపోహ.
@దుర్గెస్వర : భయపడటంలేదు. అది సంకేత నామం కాదు. మీరు నాకు మెయిల్ చెయ్యవచ్చు.

@falling angel : ఈ కథ చదవండి.
అమ్మ: బాబూ, పొయ్యిమీద పాలు కాగుతోంది కాస్త చూడు, ఇప్పుడే వస్తాను.
బాబు: అలాగే అమ్మా!
కాసేపు తర్వాత పాలు పొంగుతుంటే, అమ్మ బాబుని అడుగుతుంది ఎందుకు మంట ఆపలేదని.
బాబు: నువ్వే కదమ్మా చూడమన్నావు. చూస్తున్నాను.

మన సాంప్రదాయాల విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. పైన కథలో అమ్మ హిపోక్రసి కన్నా బాబు అవగాహనా రాహిత్యమే అసలు సమస్య. అమ్మ ఏమి చేయాలిప్పుడు? సార్వజనీక అవగాహనను దృష్టిలో ఉంచుకుని ఒక రూలు బుక్కు రాస్తుంది. పిల్లవాడు మంచివాడు తెలివైన వాడైతే గ్రహిస్తాడు. అదే గడుసు పిండమైతే, ఆ రూలు బుక్కులోని రూల్సు తో ఆడుకుంటాడు.

Kathi Mahesh Kumar said...

క్రైస్తవమతాన్ని చీల్చిచెండాడినంత సాహిత్యం ప్రపంచంలో మరే మతంలోనూ లేదు. ఎవరైనా ఒక వ్యవస్థనో మతాన్నో తప్పుబడితే అది నీచమయ్యిందని కాదు. దానిలో సరిదిద్దుకోగలిగే లోపాలున్నాయి అని. ఆ విమర్శలను పరికించి సరిదిద్దుకోగలిగితే ఆ మతంకానీ సమాజంకానీ మరింత పురోగమిస్తుందని మాత్రమే.

హిందూమతంలోని లోపాల్ని ఎత్తిచూపినంత మాత్రానా, దిగుమతి తెచ్చుకున్న అభ్యుదయవాదం కానఖ్ఖరలేదు. పర సంస్కృతీ వ్యామోహమూ వుండనక్కరలేదు.

అలాగే, అనుకూలంగా వస్తే విమర్శ అని ప్రతికూలంగా వస్తే "వితండవాదం" అనీ బ్రాండేసి డిసైడ్ చెయ్యడమం ఏ సంస్కృతిలో భాగమోకూడ గ్రహించాలి.

నా social stand pint కీ AIDS awareness కీ అపోహలు అంటగట్టేముందు, నా వ్యాఖ్యల్ని కనీసం పూర్తిగానైనా చదవండి.

Anonymous said...

nenu anedemitante-mana heritage ante manaki pride and respect lenappudu manani manam kinchaparachagalmu.if you have the pride and respect,mana alavaatlani,paddhatulani open mind to visleshinchi choodagalamu-emantaaru

చైతన్య కృష్ణ పాటూరు said...

["ఒకపక్క వంద కోట్ల జనాభా కనపడుతుంటే, మరో పక్క అదేదో దొంగచాటుగా చేయవలసిన పనిగా మనం భావిస్తుంటే, దాన్ని ద్వందప్రవృత్తిగానే భావించాలి." --> ఇది ఖండించతగినది. ఇది తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్ని పనులు నలుగురిలో చేయవచ్చు. కొన్ని నాలుగు గోడల మధ్యే వుండాలి] - నా అభిప్రాయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని మనవి. ఇలాంటివి నలుగురిలో చెయ్యాలని నేను చెప్పలేదు. ఒకసారి నా మాటని గమనించండి. చాటుగా చెయ్యటం వేరు, దొంగచాటుగా చెయ్యటం వేరు. చాటు సభ్యత కోసం. దొంగచాటుగా చేసేది మనస్సులో అపరాధ భావం వున్నప్పుడే. శృంగారానికి చాటు వుండాలే కానీ, దొంగచాటుగా చేయవలసినంత తప్పు పని కాదని, మనం ఆ అపరాధభావం వదిలించుకోవాలని నా అభిప్రాయం.

పెదరాయ్డు said...

@ మహేష్: మీ వ్యాఖ్యలు పూర్తిగా చదవకుండా ఎవరూ వ్యాఖ్యలు రాయరు. కాకపోతే వాటిని వుటంకించేటప్పుడు, మొత్తం ప్రస్తావించే వెసులుబాటు వుండదు. దానిలోని ప్రబలమైన వాదాన్ని మాత్రమే పేర్కొనడం జరుగుతుంది. ప్రతిసారీ అలా మొత్తం చదవండి అనటం బాలేదు. మీరైనా ఇలానే చేస్తారు. ఇక బ్రాండేసి డిసైడ్ చేయటం మీ వ్యాఖ్యల్లోనే ఎక్కువగా వుంటుంది. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి వాళ్ళ వ్యాఖ్యలకి ఏదో ఒక బ్రాండ్( మీ .... చిహ్నం, తరహాలో) తగిలిస్తారు. మీరు టపాలు బాగానే రాస్తారు కాని ప్రతి విమర్శకూ మీరు విపరీతమైన తర్కం చేసి ఎదుటివారు అలసిపోయేలా చేస్తారు. మీ అభిమానిగా సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్పడం నా కర్తవ్యమని భావిస్తాను. నొప్పిస్తే క్షంతవ్యుడ్ని.

చైతన్య క్రిష్ణ పాటూరు : ఈ వివరణ ఆమోదనీయమే. మీరన్నట్లు అపరాధ భావాన్ని విడనాడాలి.

Krishna K said...

కొందరికి తమ సంస్కృతి ని, తమ జాతిని తక్కువ చేసుకొని మాట్లాడటం, అలవాటు. తర తరాలుగా బానిస బ్రతుకులు బ్రతికిన మనలో కొందరు, కేవలం కొన్ని తరాలలో నే, బానిస మనస్తత్వం పోగొట్టుకోవాలని ఆశించటం కూడ అత్యాశేనెమో. కాకపోతే, ఇలాంటి వాళ్లను చూస్తుంటే మాత్రం, మన దేశం ఎప్పటికి బాగుపడదేమో (మానసికం గా) అని మాత్రం అనిపిస్తుంది.

Rajendra Devarapalli said...

నిజమే కృష్ణ గారు,మీరు మాత్రం ఆశ్చర్యకరంగా ఆ కొందరిని గూర్చి మాత్రమే తరచూ మీ వ్యాఖ్యానాలు వెలువరిస్తుంటారు.అవి చదువుతుంటే ఆ కొందరికీ మీకు ఏవో వ్యక్తిగతమైన,జాతిపరమైన,కులపరమైన గొడవలు ఉండిఉండొచ్చని నేను అపార్ధం చేసుకుంటున్నాను.
"తర తరాలుగా బానిస బ్రతుకులు బ్రతికిన మనలో కొందరు" అని శెలవిచ్చారు తమరు.మరి లెక్కలప్రకారం యావధ్భారత ఉపఖండం 1947,ఆగస్టు 15 వరకూ బానిసబ్రతుకు బతికింది.సదరు తారీఖుకు ముందు బానిసలుగా బతికిన వారిలో మీ,మా,అందరి పెద్దలూ ఉన్నారని మీకు తెలీదని అనుకునేంత అమాయకులు కాదు కానీ,మీరు రాయలేదు.
ఇలా "ఆకొందరు"అంటూ కామెంట్లు రాసే బదులు మీరూ ఒకబ్లాగు మొదలుపెట్టి మీ భావాలను మరింతవిస్తృతంగా చదివే అవకాశం మాకు ఇవ్వవలసిందిగా మనవి.
భవదీయుడు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి,
Pseudo-Secularist/కుహనాలౌకికవాది

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: రాజేంద్రగారి వ్యాఖ్యచూడానికొస్తే మీరు నన్నుద్దేశించి రాసిన వ్యాఖ్యను ఇప్పుడే చూసాను.నేను నా వ్యాఖ్యాతల్ని ఒక్కరిని మినహా మిగతావారిని ఎప్పుడూ బ్రాండలేదు. అదీ ఆ వ్యాఖ్యాత తనంతటతాను డిక్లేర్ చేసుకున్నతరువాతే నేను ఆ మాటన్నాను.

ఇక "విపరీతమైన తర్కంతో విసిగించటం" అంటారా, నా వరకూ అదొక సమాధానమో,వివరణో అయ్యుంటుంది. నేను అంగీకరించనప్పుడు నా తరఫున, నేను చెప్పే తర్కం విపరీతమని అంగీకరించనివారు అనుకోవడంలో తప్పులేది. అలా అనుకోకుంటే వారి వాదనపట్ల వారికి నమ్మకం లేనట్లే కదా!

Krishna K said...

రాజెంద్ర గారు,
మీరు కామెంట్ చూసినాక, నా కామెంట్ మరలా చదివితే, మీరు అన్న అపోహ రావటానికి ఆస్కారం వున్న మాట నిజమే అనిపించింది. నా ఉద్దెశ్యం, "మనం అందరం "తర తరాలు గా (కొన్ని వందల ఏళ్లు కనీసం) బానిస బ్రతుకు బతికామనే. ఇంకా మనలో కొందరు ఇంకా ఆ బానిస మనస్తత్వం నుండి (మనం కాని, మన సంస్క్రుతి గాని తక్కువ అనే) బయటపడ లేక పోతున్నమనే నా ఉద్దెశ్యం. అంతకు తప్ప వెరే మాత్రం లేవు. మీరు మీకు అనిపించింది, లోపల దాచుకొకుండా, బయటపడి వివరణ అడిగినందులకు, నెనర్లు.

ఇక మీకు మీరు కుహాన లౌకిక వాది గా వ్రాసుకున్నారు, దాని గురించి ఏమనగలం!.

Mitra said...

That shows lack of self-confidence in oneself (Hindus).

The 1200 years rule of Muslims (710 AD to 1857 AD) and Christians (1957 AD - 1947 AD) rob the soul out of Hinduism.

That was the reason why Hindus imported a White Italian Christian Women to rule over them, after expelling Christians in 1947.

During Christian rule tens of thousands of Indians died (economic collapse, because they destroyed local means of lively hood and famines created by them).

Note: British were White Christians, so it is appropriate to use “Christians” instead of British.